వడగాడ్పుల భారీన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విపత్తుల నిర్వహణ శాఖ కార్యశాలను నిర్వహించింది. పట్టణాల నుంచి పల్లెల వరకు క్షేత్రస్థాయిలో సమగ్ర నివేదికలను సిద్ధం చేసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ ప్రధాన కమిషనర్ రాజేశ్వర్ తివారి అధికారులకు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ, టీఎస్డీపీఎస్, యూనిసెఫ్, ఐఎండీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెస్ ఆడిటోరియంలో కార్యశాల నిర్వహించారు.
జనంసాంద్రతేకారణం
అవగాహన లేకపోవడంవల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని భారత వాతావరణ శాఖ సంచాలకులు వైకే రెడ్డి అన్నారు. భూమిపై జనసాంద్రత పెరుగుతున్నందున అడవులు అంతరించిపోతున్నాయని దీని ఫలితంగానే వరదలు, ఇతర విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. వడగాడ్పులపై అవగాహన కోసం ప్రచార గోడ పత్రిక, సీడీని వైకే రెడ్డి ఆవిష్కరించారు.
ఇవీ చదవండి:ఆయనే కర్త, కర్మ, క్రియ