ETV Bharat / state

ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం! - How to do dhanteras puja

ధన త్రయోదశి... ఈ రోజు నుంచి దీపావళీ వేడుకలు ప్రారంభమవుతాయి. త్రయోదశి పర్వదినాన లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం ఏం చేయాలి... అమ్మవారి కృపకు పాత్రులు కావాలంటే ఏ విధంగా పూజ చేయాలి?

ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!
author img

By

Published : Oct 25, 2019, 12:28 PM IST

ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా వ్యవహరిస్తారు. లక్ష్మీ కటాక్షం ప్రసాదించే పర్వదినమిది. ఈ రోజు నుంచే దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. నాటి ఉదయం లక్ష్మీదేవి భూమికి దిగివస్తుందని, అంతటా సంచరిస్తుందని పెద్దలు చెబుతారు. శుచి, శుభ్రత, సంప్రదాయం పాటించే ఇంటిలో కొలువుదీరుతుందని నమ్ముతారు. అందుకే ధన త్రయోదశి నాడు వేకువజామునే ఇల్లూవాకిలీ శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీ దేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముంగిట అందమైన రంగవల్లికలు తీర్చిదిద్దాలి.

మంగళకరంగా పూజ చేయాలి

ఇంటిలోని వారందరూ అభ్యంగన స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, తమ పూజామందిరాన్ని మంగళకరంగా అలంకరించుకొని, లక్ష్మీపూజ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వెండి వస్తువులను, బంగారు ఆభరణాలను శుభ్రం చేసి పూజా మందిరంలో ఉంచి.. వాటినే లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించాలి.

లక్ష్మీ కటాక్షం కలగాలంటే

సంపదపై పవిత్రమైన భావన కలిగి ఉండాలి. ధనాన్ని సద్వినియోగం చేయడమే లక్ష్మీదేవి ఆరాధన. ఇందుకు ధన త్రయోదశినాడు శ్రీకారం చుట్టాలి. ఇలా సంకల్పించుకున్న వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం వివరిస్తోంది.

మూడు రోజుల పాటు వేడుకలు

ధన త్రయోదశి నుంచి దీపావళి వరకు మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ‘గో త్రిరాత్ర వ్రతం’ నిర్వహిస్తారు. గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావించి సేవ చేస్తారు.

దక్షిణం వైపు దీపం

ధన త్రయోదశి నాడు పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదించడానికి భూమికి దిగి వస్తారని, వారికి దారి చూపడానికి ఇంటిలో దక్షిణం వైపు దీపం పెట్టాలని పెద్దలు చెబుతారు. ఇలా దీపారాధన చేసిన వారికి అపమృత్యుదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

  • ధన త్రయోదశి ప్రత్యేకతలు
  • పండగ జరిగే మూడు రోజుల పాటు ఆవు నెయ్యితో వెలిగించిన దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. దీపదానం చేయడం కూడా సంప్రదాయంలో భాగం. లక్ష్మీపూజ, దీపారాధన, దీపదానం, అపమృత్యుపరిహారం.. ఇవన్నీ ధన త్రయోదశి ప్రత్యేకతలు.

Intro:Tg_hyd_12_25_minisyer_kishan_reddy_padayayra_AB_TS10021

raghu_sanathnagar_9490402444

గాంధీజీ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు

మహాత్మాగాంధీ 150 జయంతిని పురస్కరించుకొని స్థానిక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ నుంచి మోతీ నగర్ ఎర్రగడ్డ చౌరస్తా వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గాంధీజీ సంకల్ప పాద యాత్రను చేపట్టారు

గాంధీజీ మహా సంకల్ప యాత్రను బిజెపి పి.ఎస్ నియోజక ఇన్చార్జ్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాదయాత్రకు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పాదయాత్ర నిర్వహించారు

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు భారతదేశంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన కోరారు

అదేవిధంగా భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా స్వచ్ఛభారత్ లో భాగంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు
ముఖ్యంగా మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని మోడీ ఆశయ సాధన మేరకు భారతదేశాన్ని ప్లాస్టిక్ రహిత సమాజ సమాజంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు

అనంతరం బోరబండ లో నుంచి పాదయాత్ర కొనసాగి బోరబండ డివిజన్ లోని వివిధ బస్తీలు ఈ విధంగా మోతీ నగర్ ఎర్రగడ్డ చౌరస్తా వరకు సుమారు ఏడు కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

bite..... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి

note.... సార్ ఈ ఐటమ్ ను ఈటీవీ తెలంగాణ కు వాడగలరు...

Body:.......

Conclusion:......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.