How to Apply Income Certificate in Telangana Online : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలంటే.. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అలాగే రైతులు సబ్సిడీ పొందాలన్నా.. విద్యార్థులు, నిరుద్యోగులు స్కాలర్ షిప్స్ కోసం, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం ఇలా.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఇన్కమ్ సర్టిఫికేట్(Income Certificate) అవసరం పడుతుంది. అయితే.. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కోసం MRO కార్యాలయాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కూర్చొనే ఆన్లైన్లో ఈజీగా తెలంగాణ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు. మరి, ఈ సర్టిఫికెట్ పొందాలంటే కావాల్సిన పత్రాలు ఏంటి? ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందడానికి అవసరమైన పత్రాలివే..
- స్కాన్ చేసిన ఆధార్ కార్డ్(Aadhaar Card) కాపీ
- స్కాన్ చేసిన ఆహార భద్రత కార్డు/రేషన్ కార్డు కాపీ
- IT రిటర్న్స్ లేదా అఫిడవిట్ (ఐచ్ఛికం)
- మునుపటి ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఐచ్ఛికం )
- స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటో కాపీ
How to Apply Telangana Income Certificate in Online :
ఆన్లైన్లో తెలంగాణ ఆదాయ ధ్రువీకరణ పత్రానికి అప్లై చేసుకోండిలా..
- మొదట మీరు మీసేవా అధికారిక పోర్టల్‌లో పౌరుడిగా నమోదు చేసుకోవాలి.
- అది విజయవంతమైన తర్వాత.. మీరు పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత రెవెన్యూ సర్టిఫికెట్ల ఎంపికను ఎంచుకోవాలి.
- ఇప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
- అక్కడ అవసరమైన అన్ని వివరాలనూ పూరించాలి. సూచించిన పత్రాలను PDF ఫార్మాట్లో అప్‌లోడ్ చేయాలి.
- ఆ తర్వాత ఆదాయ పత్రం డెలివరీ ఎంపికను ఎంచుకోవాలి.
- అనంతరం ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతి ద్వారా రుసుము చెల్లించాలి.
- ఇక సర్టిఫికెట్ ఆమోదం పొందడానికి కనీసం 7 రోజులు వేచి ఉండాలి.
- మీరు పోస్టల్ డెలివరీని ఎంచుకుంటే.. అది మీ నమోదిత చిరునామాకు 3 నుంచి 4 రోజులలోపు బట్వాడా అవుతుంది.
T Wallet అప్లికేషన్‌ని ఉపయోగించి తెలంగాణ ఆదాయ ధ్రువీకరణ పత్రానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
- మొదట ప్లేస్టోర్ నుంచి T Wallet అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి.
- అనంతరం రెవెన్యూ సర్టిఫికెట్లను ఎంచుకోవాలి. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అడిగిన వివరాలను పూరించాలి. ఆధార్ కార్డ్, FSC, మునుపటి ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా ఏదైనా కుటుంబ సభ్యుల ఆదాయ రుజువును అప్‌లోడ్ చేయాలి.
- అనంతరం ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఫీజు చెల్లించాలి. ఈ తర్వాత మీ దరఖాస్తు ఒక వారంలోపు ధ్రువీకరించబడుతుంది.
- ఆ తర్వాత మీకు ఆదాయ ధ్రువీకరణ పత్రం వస్తుంది.
How To Apply Telangana Income Certificate in Offline :
ఆదాయ ధ్రువీకరణ పత్రానికి ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
- మీరు మొదట సమీపంలోని మీసేవా కేంద్రాన్ని సందర్శించి ఆదాయ ధ్రువీకరణ దరఖాస్తు ఫారమ్‌ను తీసుకోవాలి.
- ఆ తర్వాత అందులో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. అలాగే అవసరమైన పత్రాలను అటాచ్ చేయాలి.
- అనంతరం MRO కార్యాలయానికి వెళ్లి.. దరఖాస్తు ఫారమ్‌పై అధికారులతో సంతకం చేయించాలి.
- ఆ తర్వాత మళ్లీ మీసేవా కేంద్రానికి అప్పగించాలి.
- ఇక చివరగా మీ సేవా కేంద్రం నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందుతారు.
How to Search EC in IGRS Telangana: ఈసీ చూసుకోవాలా..? IGRS పోర్టల్‌కు వచ్చేయండి..!