How to Apply Telangana Chenetha Mitra Scheme: రాష్ట్రంలోని చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం.. "చేనేత మిత్ర" పథకాన్ని ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందజేసి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఈ పథకం లక్ష్యం. చేనేత మిత్ర పథకం కింద.. అందరికీ ఒకే విధమైన ఆర్థిక సహాయం అందుతుంది. మరి, ఈ స్కీమ్‌కు అర్హత ప్రమాణాలేంటి? ఎలా దరఖాస్తు చేయాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ "చేనేత మిత్ర" పథకం ప్రయోజనాలు..
- తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకం ప్రారంభించబడింది.
- ఈ కార్యక్రమం ద్వారా చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
- లబ్ధిదారులు డీబీటీ ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లోకి అందుకుంటారు.
- ఈ పథకం కింద అందే ఆర్థిక సహాయం మొత్తం రూ.3,000
- ఈ పథకానికి ఆన్‌లైన్లో లేదా.. ఆఫ్‌లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
తెలంగాణ చేనేత మిత్ర పథకానికి అర్హత ప్రమాణాలు: చేనేత మిత్ర పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారంతా.. తప్పనిసరిగా ఈ కింది అర్హతా ప్రమాణాలు కలిగి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివసించాలి.
- దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా.. ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి.
దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
- పాస్‌పోర్ట్ సైజు ఫొటో
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- ఓటరు కార్డు
- మొబైల్ నంబర్
- శాశ్వత సర్టిఫికేట్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ ఖాతా వివరాలు
- పాస్‌బుక్ ఫొటోకాపీ
- ఇ-మెయిల్ ఐడీ
తెలంగాణ చేనేత మిత్ర పథకం 2023 కోసం దరఖాస్తు చేయడం ఎలా..?
How to Apply Chenetha Mitra :
- ముందుగా టీఎస్ చేనేత అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.(https://handtex.telangana.gov.in/Default.aspx)
- ఆ తర్వాత External Linksలో Chenetha Mitra ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ కాలమ్‌లో Sign Up ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వివరాలు ఎంటర్ చేసి Submit ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత హోమ్ పేజీలోకి వెళ్లి వివరాలు ఎంటర్ చేసి Login ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీకు స్క్రీన్‌పై దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- అక్కడ అవసరమైన అన్ని వివరాలనూ ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత సమర్పించాల్సిన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయండి.
- తర్వాత మీ బ్యాంక్ వివరాలను నమోదు చేయండి.
- చివరగా, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
Handloom Entrepreneur : కష్టపడితే కానిదేముందని నిరూపిస్తున్న మహిళ