ETV Bharat / state

How to Apply Caste Certificate in Telangana : ఆన్​లైన్​లో కుల ధ్రువీకరణ పత్రం.. ఎలా పొందాలో తెలుసా..? - తెలంగాణలో క్యాస్ట్ సర్టిఫెకెట్ ఎలా పొందాలి

కుల ధ్రువీకరణ పత్రం అనేది పౌరులందరికీ.. ప్రభుత్వం అందించే ముఖ్యమైన పత్రాలలో ఒకటి. మరి ఈ సర్టిఫికెట్​ ను ఆన్​లైన్ ద్వారా ఎలా పొందాలి..? దానికోసం ఎలా దరఖాస్తు చేయాలి..? ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్స్​ ఏంటి..? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

How to Apply Caste Certificate in Online
How to Apply Caste Certificate in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 5:27 PM IST

How to Apply Caste Certificate in Telangana: మన దేశంలో కేంద్ర, రాష్ట్రాలు ప్రభుత్వాలు అందిస్తున్న పలు ప్రయోజనాలను పొందాలంటే.. కుల ధ్రువీకరణ పత్రం(Caste Certificate) తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. రైతులకు సబ్సిడీ.. విద్యార్థులకు స్కాలర్ షిప్స్.. ఉద్యోగాల్లో రిజర్వేషన్స్.. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి.. ఇలా.. ఎన్నో విషయాల్లో కుల ధ్రువీకరణ పత్రం కంపల్సరీ. మరి, వీటికోసం ఆన్ లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..? అప్లై చేసిన వాళ్లు.. అప్లికేషన్​ స్టేటస్​ను ఎలా ట్రాక్​ చేయాలి..? అలాగే "మీ సేవ" ద్వారా సవరణ విధానాలు ఎలా చేయాలి..? వంటి విషయాలు తెలుసుకుందాం.

How to Apply Caste Certificate in Telangana Through Online :

  • ముందుగా మీ సేవా అధికారిక వెబ్​సైట్​ ఓపెన్​ చేయండి.
  • రెవెన్యూ(Revenue) ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.
  • ఆ తర్వాత కమ్యూనిటీ అండ్​ డేట్​ ఆఫ్​ బర్త్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేస్తే ఓ విండో ఓపెన్​ అవుతుంది.
  • కుడివైపు కాలమ్​లో డౌన్లోడ్​ అప్లికేషన్​ ఫారమ్​ మీద క్లిక్​ చేస్తే ఫారమ్​ డౌన్​లోడ్​ అవుతుంది.
  • అప్లికేషన్​ను ప్రింట్​ అవుట్​ తీసిన తర్వాత.. అందులో పూర్తి వివరాలను నింపాలి.
  • అంటే.. దరఖాస్తుదారు పేరు, కుటుంబ వివరాలు, ఇంటి చిరునామా, మతం, కులం మొదలైన సమాచారం ఇవ్వాలి.
  • ఆ తర్వాత దరఖాస్తు ఫారానికి.. SSC మెమో, రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి అడిగిన ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి.
  • అన్ని పనులూ పూర్తిచేసిన తర్వాత.. ఈ సర్టిఫికెట్లన్నీ తీసుకొని, మీ సేవ కేంద్రానికి వెళ్లి సమర్పించాలి.
  • ఈ సమయంలో.. మీ సేవ ఆపరేటర్ రసీదు సంఖ్య లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దాన్ని భద్రపరుచుకోవాలి.
  • సుమారు 15రోజుల తర్వాత మీ సేవా కేంద్రానికి వెళ్లి క్యాస్ట్​ సర్టిఫికెట్​ తీసుకోవాలి.
  • ఫామ్ డౌన్​లోడ్ చేసుకోవడం భారం అనుకుంటే.. కావాల్సిన పత్రాలన్నీ తీసుకొని మీసేవా కేంద్రానికి వెళ్లినా సరిపోతుంది. మిగిలిన ప్రాసెస్ మొత్తం వారే చేస్తారు.

Bihar Caste Census Supreme Court : 'కులగణన అధికారం కేంద్రానిదే! రాష్ట్రాలకు సంబంధం లేదు'

How to check Caste Certificate Status: కుల ధృవీకరణ పత్రం స్టేటస్​ చెక్​ చేయడం ఎలా..?

  • అధికారిక తెలంగాణ మీసేవ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలోనే “Know Your Application Status'” అనే విభాగానికి వెళ్లండి.
  • టెక్స్ట్ కాలమ్‌లో అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్​ చేసి.. దాని ప్రక్కన ఉన్న "GO"పై క్లిక్ చేయండి.
  • స్క్రీన్​పై మీ కుల ధృవీకరణ పత్రం అప్లికేషన్ స్టేటస్​ చూపుతుంది.

How to Apply for Birth Certificate Telangana : జనన ధ్రువీకరణ పత్రం పొందడం ఎలా.. ?

Corrections in Caste Certificate through MeeSeva: మీ కుల ధృవీకరణ పత్రంలో ఏమైనా తప్పులు దొర్లితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రంలో సవరణలు చేయడానికి అవకాశం అందిస్తుంది.

  • ఇందుకోసం.. మీసేవ వెబ్‌సైట్ లేదా మీసేవ కేంద్రం నుంచి కరెక్షన్​ ఫారమ్‌ను తీసుకోండి.
  • అవసరమైన అన్ని వివరాలనూ.. వాటి సంబంధిత నిలువు వరుసలలో పూరించండి.
  • అలాగే, సర్టిఫికెట్‌లో మీరు మార్చుకోవాల్సిన వివరాలను నమోదు చేయండి.
  • మీరు మార్చాలని కోరుతున్న వివరాలు సరైనవని చూపించే.. ప్రూఫ్ డాక్యుమెంట్ ను దానికి జతచేయాలి.
  • ఆ తర్వాత మీ సేవా కేంద్రం ఆపరేటర్‌కు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.

Caste Certificate Issue in Telangana : కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం.. సర్కార్​పై ఫైర్ అవుతున్న జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.