ETV Bharat / state

ఐటీఐఆర్​ ప్రాజెక్టుపై కేంద్రం వైఖరేంటి: కేటీఆర్​ - తెలంగాణ తాజా వార్తలు

ఐటీఐఆర్​ ప్రాజెక్టుపై వైఖరేంటో చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు మంత్రి కేటీఆర్​ లేఖ రాశారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్​ పలుసార్లు కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు.

ktr
ఐటీఐఆర్​ ప్రాజెక్టుపై కేంద్రం వైఖరేంటి...: కేటీఆర్​
author img

By

Published : Jan 7, 2021, 8:52 PM IST

Updated : Jan 7, 2021, 9:02 PM IST

ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 2014 నుంచి ఈ ప్రాజెక్టుపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం లేదని ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడం లేదా అంతకు మించి మేలైన మరొక కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.

అసలేంటీ ఐటీఐఆర్..

2008లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్​మెంట్​ రీజియన్) పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంది. ఇందుకు సంబంధించి 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేసింది. ఐటీఐఆర్ కోసం 49,000 ఎకరాలతో పాటు మూడు క్లస్టర్​లను హైదరాబాద్​ గుర్తించారు. తద్వారా అనేక నూతన ఐటీ కంపెనీలను నగరానికి రప్పించేందుకు, పెట్టుబడులకు ప్రోత్సాహకంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ ప్రాజెక్టు నమూనాని సమీక్షించి, మరింత మేలైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పింది. 2017లో ఇందుకు సంబంధించి ఐటీఐఆర్ భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరిపినా, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాలేదని మంత్రి కేటీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఆరు సంవత్సరాలు గడిచినా..

ఐటీఐఆర్​పైన ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్​ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాయడం సహా విజ్ఞప్తులూ ఇచ్చినట్లు కేటీఆర్​ గుర్తుచేశారు. ఇంత కీలకమైన ప్రాజెక్టుపైన గత ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఐటీఐఆర్ మొదటిదశలో భాగంగా గుర్తించిన పలు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రైల్వే మరియు రోడ్డు రవాణా శాఖలకు సంబంధించి అదనపు నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే వస్తోందన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఇప్పటి వరకు హైదరబాద్​లో ఐటీఐఆర్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని కేటీఆర్​ ఆందోళన వ్యక్తం చేశారు.

110 శాతం వృద్ధి సాధించాం..

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకున్నా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ రంగంలో గొప్ప వృద్ధిని తెలంగాణ సాధించిందని కేటీఆర్​ తెలిపారు. 2014లో ఉన్న 57,258 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులను 2019- 20 నాటికి 1,28,807 కోట్ల రూపాయలకు పెరిగేలా చేశామన్నారు. మొత్తంగా తెలంగాణ... గత ఆరు సంవత్సరాలుగా స్థూలంగా 110 శాతం వృద్ధిని సాధించిందన్నారు. ఇది జాతీయ సగటు కన్నా ఎంతో ఎక్కువ అని తెలిపారు. ఐటీ ఉద్యోగుల సంఖ్య సైతం దాదాపుగా రెట్టింపు అయిందని మంత్రి పేర్కొన్నారు.

సానుకూల నిర్ణయం తీసుకోండి..

ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్ పథకాన్ని లేదా అంతకు మించి మెరుగైన కార్యక్రమాన్ని అందిస్తే ఐటీ పరిశ్రమ, దాని వృద్ధికి బలమైన ఊతం ఇస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐఆర్ ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు. ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇవీచూడండి: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే

Last Updated : Jan 7, 2021, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.