ETV Bharat / state

లాక్​డౌన్ వేళ... ఇల్లాలికి పెరుగుతున్న ఒత్తిడి - కరోనా

కరోనా కట్టడి నేపథ్యంలో లాక్​డౌన్ విధించి అందరూ ఇంట్లో ఉండండి... కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇది నివారణ చర్యల్లో భాగమే అయినా... ఇంట్లోని మహిళలకు మాత్రం వేధింపులు తప్పడంలేదు. పిల్లలు, భర్త ఇంటిపట్టున ఉంటున్నందుకు సంతోషిస్తూ... పెరుగుతున్న ఒత్తిడిని భరిస్తున్నా... ఆమెకు మాత్రం కష్టాలు తప్పడంలేదు.

house-wife-problems-in-lockdown
లాక్​డౌన్ వేళ... ఇల్లాలికి పెరుగుతున్న ఒత్తిడి
author img

By

Published : Apr 14, 2020, 7:32 AM IST

కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో గృహహింస, మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు వదిలి బయటికి రాలేని వందల మంది హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరికి.. ఎలా.. చెప్పుకోవాలో తెలియక బాధను గుండె లోతుల్లో, కోపాన్ని పంటి బిగువన దాచుకొని మిన్నకుండిపోయేవారు వేలల్లో ఉంటున్నారు. అవగాహన ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ నెంబరు 181కు ఫోన్‌ చేస్తున్నారు.

  • నా భర్తకు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. లాక్‌డౌన్‌తో కొన్ని రోజులు బ్లాక్‌లో మందు కొన్నారు. వారం రోజులుగా దొరకడం లేదు. దీంతో ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మందు కావాలని, డబ్బులు ఇవ్వమని నన్నూ... పిల్లలను కొడుతున్నారు.
  • లాక్‌డౌన్‌తో మా ఆయన, ఇద్దరు పిల్లలు, మా మామయ్య ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇంటి పనంతా ఒక్కదాన్నే చేయాల్సి వస్తోంది. ఆఫీసుకు వెళ్లేటప్పుడు పని సాయం చేసే మా ఆయన ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కనీసం పిల్లలనూ చూడటంలేదు. ఏదైనా పని చెబితే కోప్పడుతున్నారు. పనంతా చేయలేక ఏడుపొస్తోంది.
  • లాక్‌డౌన్‌ ముందు రోజుకు సగటున 500 కాల్స్‌ రాగా.. తర్వాత 20 శాతం పెరిగాయి. మార్చి 22 నుంచి 31వ తేదీ వరకు పది రోజుల్లో ప్రతిరోజూ సుమారు 580 మంది సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఫోన్‌ చేశారు.

స్వచ్ఛంద సంస్థలకు పెరిగిన ఫిర్యాదులు

పని ఒత్తిడి, వేధింపులపై మహిళ స్వచ్ఛంద సంస్థల హెల్ప్‌లైన్లకు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ సంస్థ ఆధ్వర్యంలో నడిచే భూమిక హెల్ప్‌లైన్‌ 1800 425 2908కు గృహహింస, పని ఒత్తిడి, లైంగిక వేధింపులకు సంబంధించి రోజుకు సగటున 15 నుంచి 20 ఫోన్లు వస్తున్నాయని నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి తెలిపారు. పురుషులకు పనిలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు సైతం మహిళలపై వేధింపులకు కారణం అవుతున్నాయన్నారు. గడిచిన 15 రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువైనట్లు తమ పరిశీలనలో తేలిందని వివరించారు.

  • మగవాళ్లు, పిల్లలు, పెద్దలు ఇంట్లో ఉండటం వల్ల ఇంటిపని పెరిగిపోయి తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నాం.
  • మద్యం, కల్లు అందుబాటులో లేక చాలామంది పురుషులు వింతగా ప్రవరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు.
  • లైంగిక వాంఛ తీర్చాలని బలవంతం చేయడం ఎక్కువైంది.
  • అవాంఛిత గర్భాలు పెరిగిపోయి ఒత్తిడికి గురవుతున్నాం.
  • పని లేక, ఆదాయం తగ్గిపోయి ఇంటిపట్టునే ఉంటున్న మగవాళ్లు కుంగుబాటు ధోరణులు, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: పేటీఎం బ్లాక్ అయిందంటూ.... లక్షల్లో స్వాహా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.