ETV Bharat / state

'వాళ్లు లంచాలు ఇస్తే వీళ్లు అనుమతి పత్రాలు ఇస్తారు' - HOUSE SURGEONS DIS CONTINUE TO INTERNSHIP

సికింద్రాబాద్ గాంధీ వైద్య విద్యలో అవకతవతలు జరుగుతున్నాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​కి ఆకస్మిక బదిలీ అయిన వైద్యుడు వసంత్ ఆరోపణలు చేశారు. నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ తర్వాత సాగే హౌస్ సర్జన్​కు గైర్హాజరవుతున్నారు. ఫలితంగా డబ్బులతో పత్రాలను కొంటున్నారని... ఇందుకు బలం చేకూర్చేందుకు విద్యార్థుల గైర్హాజరు పట్టికను ప్రదర్శించారు.

'ఇంటర్న్ షిప్​కు వైద్య విద్యార్థుల గైర్హాజరు'

author img

By

Published : Feb 13, 2020, 6:24 AM IST

Updated : Feb 13, 2020, 8:19 AM IST

వైద్య విద్యలో... నాలుగున్నరేళ్ల తరగతి గది పాఠాలు ఒక ఎత్తైతే ఏడాది పాటు సాగే ఇంటర్న్ షిప్ మరో ఎత్తు. రోగులకు ఏడాది పాటు సేవలు అందిస్తూ... నేర్చుకున్న పాఠాలను అమలు చేసే ఈ ఇంటర్న్ షిప్​కి వైద్య విద్యార్థులు ఎగనామం పెడుతున్నారు. బదులుగా పీజీకి సన్నద్ధమవుతూ... విధులకు గైర్హాజరవుతున్నారని గాంధీ నుంచి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​కి ఆకస్మిక బదిలీ అయిన వైద్యుడు వసంత్ ఆరోపించారు.

హాజరుకాని రోజులకు లంచాలు ఇచ్చి... సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారని వెల్లడించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో... అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని మెడికల్ జేఏసీ సభ్యులు సైతం ఆరోపణలు గుప్పిస్తుండటం గమనార్హం.

తూతూ మంత్రంగా...

రోగులను పరీక్షించి... వైద్య సేవల్లో మెళకువలు నేర్చుకోవడంలో అత్యంత కీలక సమయమే ఇంటర్న్ షిప్. అలాంటిది ఏడాది పాటు సాగే ఈ శిక్షణ కాలాన్ని తూతూ మంత్రంగా జరిపిస్తున్నారనేది ఎంతో కాలంగా ఉన్న వాదన. దీనిపై గతంలో వైద్య విద్య సంచాలకులు త్రిసభ్య కమిటీ వేశారు. ఆ కమిటీ పర్యవేక్షణలో... ఆయా విభాగాల అధిపతులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని పరిశీలించి... ఇంటర్న్ షిప్ పూర్తైనట్టు ధ్రువీకరణ పత్రాన్నివ్వాలి. ఈ ప్రక్రియలో అవినీతి నెలకొందని... ఇటీవల గాంధీ నుంచి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​కి సరెండరైన వైద్యుడు వసంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. పలువురు వైద్య విద్యార్థుల హాజరు పట్టికకు సంబంధించి... పత్రాలను కూడా చూపిస్తుండటం గమనార్హం.

సక్రమంగా చేస్తేనే వైద్యార్హత !!

ఎంబీబీఎస్ తరగతులు పూర్తైన తర్వాత ఏడాది పాటు ఇంటర్న్ షిప్ సక్రమంగా పూర్తి చేస్తేనే వైద్యులుగా అర్హత సాధిస్తారు. ఆ తరువాత పీజీకి సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే పీజీ సీటు సాధించేందుకు సన్నద్ధమయ్యే క్రమంలో వైద్యులు ఈ ఇంటర్న్ షిప్​కి ఎగనామం పెడుతున్నారని వసంత్​తో పాటు మెడికల్ జేఏసీ సభ్యులు అన్నారు. సర్టిఫికెట్ పొందేందుకు గానూ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇతర అధికారులకు లంచాలు ఇస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ సహా... ఇతర ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చేసినవారు... గాంధీలోనే ఇంటర్న్ షిప్ చేస్తామంటున్నారని పేర్కొన్నారు. వసంత్ బహిర్గతం చేసిన పత్రాల్లో కొందరు వైద్యులు ఏడాదిలో 300 రోజులకుపైగా విధులకు గైర్హాజరైనట్టు ఉండటం వైద్య వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.

లక్షలు చేతులు మారుతున్నాయి...

మొత్తంగా బోధనాసుపత్రుల్లో వైద్య విద్యార్థులు ఇంటర్న్ షిప్ పూర్తి చేసినట్టు... పత్రాలు ఇచ్చేందుకు రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న వార్తలకు ఈ ఆధారాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.

'ఇంటర్న్ షిప్​కు వైద్య విద్యార్థుల గైర్హాజరు'

ఇవీ చూడండి : 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో బలహీన వర్గాలకు అన్యాయం'

Last Updated : Feb 13, 2020, 8:19 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.