నగరంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంకి రాము అనే వ్యక్తి అంబర్పేటలో కూలి పనులు చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈనెల 18న ఓ బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం తెలిసింది. నిందితుడి నుంచి 1,80,000 విలువైన 90 గ్రాముల బంగారం, 192 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
ఘరానా దొంగ కటకటాలకు - thieft
తాళం వేసి ఉన్న ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతూ అటు ప్రజలకు ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగకు నల్లకుంట పోలీసులు చెక్పెట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.