హైదరాబాద్ పాతబస్తీ మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం పక్కన ఉన్న పురాతన భవనం కుప్పకూలింది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న భవనం... ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు తడిసి ఒక్కసారిగా కూలిపోయింది.
పురాతన ఇల్లు కావడం వల్ల ప్రస్తుతం ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. భవనం కూలిన సమయంలో అటుగా వాహనదారులు, పాదచారులు వెళ్తున్నారు. ఈ ఘటనలో మహిళ సహా పలువురికి త్రుటిలో అపాయం తప్పింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.
ఇదీ చూడండి: సెల్లార్లోకి వరద... నీటిలో మునిగి బాలుడు మృతి