ETV Bharat / state

'కరోనా' భోజనంబు... ఆరోగ్యమైన వంటకంబు - ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్న హొటళ్​ వివాహబోజనంబు

కరోనా మహమ్మారి భోజన ప్రియుల కడుపుమీద కొట్టింది. వారాంతాల్లో హొటళ్లలో విందు భోజనాలు ఆరగించే వారికి ఎక్కడ ఏం తింటే ఏం జరుగుతుందోననే భయం పట్టుకుంది. అలాంటి వారికోసమే భాగ్యనగరంలోని పలు హొటళ్లు ఆరోగ్యవంతమైన ఆహారంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భోజనాలు వడ్డిస్తున్నాయి.

hotel vivahabojanambu
'కరోనా' భోజనంబు... ఆరోగ్యమైన వంటకంబు
author img

By

Published : Jul 7, 2020, 9:39 PM IST

భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు నగరంలోని పలు హొటళ్లు ప్రత్యేక వంటకాలను అందిస్తున్నారు. కరోన వైరస్ నుంచి రక్షించుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నాయి.

హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని వివాహ భోజనం హోటల్ నిర్వాహకులు భోజన ప్రియుల కోసం ప్రత్యేక వంటకాలు వడ్డిస్తున్నారు. ఇందుకోసం వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధగుణాలున్న పదార్థాలను వేసి వండుతున్నారు. ప్రస్తుతం వ్యాపారం ఆశాజనకంగా లేకపోయినా భవిష్యత్తులో పుంజుకుంటుందని హొటళ్ల​ యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.