ETV Bharat / state

హాస్టల్‌... కరోనా కష్టాల్‌ - వసతి గృహాల్లో విద్యార్థుల కష్టాలు

విద్యార్థులను హాస్టల్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వసతి గృహాల్లో ఉంటున్న వారిలో కొందరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. కరోనా కష్టకాలంలో ఎక్కువ మంది ఒకే గదిలో ఉండటం వీలు కాని పరిస్థితి. భౌతిక దూరం పాటిస్తూ గదులు కేటాయించాల్సి వస్తే కేవలం 30- 50 మేర సామర్థ్యాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు వర్సిటీ వసతి గృహాల్లో సామర్థ్యానికి మించి ఉండగా.. వారిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియడంలేదని అధికారులు అంటున్నారు.

హాస్టల్‌... కరోనా కష్టాల్‌
హాస్టల్‌... కరోనా కష్టాల్‌
author img

By

Published : Jun 1, 2020, 3:54 PM IST

Updated : Jun 1, 2020, 4:03 PM IST

విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో పీజీ సీట్లు పొందే విద్యార్థులకు హాస్టల్‌ నీడ దొరకడం కష్టంగా మారనుంది. ఇప్పటికే హాస్టళ్లలో ఉంటున్న వారిలో కొందరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ఇక అధిక సంఖ్యలో ఉంటున్న ఇతరులు గదుల్లో ఉండటం కుదరని పని. ఇది కరోనా వైరస్‌ తెచ్చిన చిక్కు. భౌతికదూరం పాటించాల్సి వస్తే ఇప్పుడున్న వసతి గృహాల సామర్థ్యాన్ని 30-50 శాతం తగ్గించడం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే వసతి గృహాల కొరత భారీగా ఉంది. డిమాండ్‌కు తగ్గట్లు హాస్టళ్ల నిర్మాణం చేపట్టని విశ్వవిద్యాలయాలు ఉన్న వాటిలోనే విద్యార్థులను సర్దుతున్నాయి. పలు హాస్టళ్లలో సామర్థ్యానికి మించి 20-30 శాతం మంది అధికంగా ఉంటున్నారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో హాస్టళ్లలో భౌతికదూరం నిబంధన పాటిస్తే 30 నుంచి 50 శాతం సీట్లు తగ్గించాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణ, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇటీవల యూజీసీ మార్గదర్శకాలు ఇచ్చినా హాస్టళ్ల పరిస్థితిపై ఏమీ చెప్పలేదు. విశ్వవిద్యాలయాల అధికారులు సైతం ఈ సమస్యపై ఇప్పటివరకు చర్చించకపోవడం గమనార్హం. ఈసారి ఇతరులు ఉండకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని సిద్ధంగా ఉండాలని, లేకుంటే ఇదే పెద్ద సమస్య అవుతుందని కామర్స్‌ విభాగం విశ్రాంత ఆచార్యుడు సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

ఇదీ వర్సిటీల్లో పరిస్థితి

  • ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 22 హాస్టళ్లు ఉన్నాయి. వాటి సామర్థ్యం దాదాపు 5 వేలు. ఇప్పుడు వాటిల్లో 7 వేలమందికి పైగానే ఉంటున్నారు. బాలికల హాస్టల్‌లో 500 గదులున్నాయి. అందులో 2,400 మంది ఉండటం గమనార్హం. భౌతికదూరం పాటిస్తే వెయ్యి మంది మాత్రమే ఉండాలి. ఓయూలో దాదాపు పూర్తి కావొచ్చిన 100 పడకల హాస్టల్‌ను అందుబాటులోకి తెస్తే కొంత ఊరట కలగనుంది.
  • జేఎన్‌టీయూహెచ్‌లోని ఏడు హాస్టళ్లలో సుమారు 2,500 మంది ఉంటున్నారు. ఒక్కో గదికి 4-5 మంది ఉండాల్సిన పరిస్థితి. పీజీ విద్యార్థులుండే గౌతమి వసతిగృహంలో 222 గదులున్నాయి. గదికి ముగ్గురు చొప్పున 666 మంది ఉండొచ్చు. భౌతికదూరం నిబంధన అమలు చేస్తే 444 మంది మాత్రమే ఉండటానికి వీలవుతుంది. ఇప్పటికే మూసివేసిన గోదావరి, కృష్ణా హాస్టళ్లకు మరమ్మతులు చేసి బాలురకు, వృథాగా ఉన్న సిబ్బంది నివాస గృహాలను బాలికలకు వినియోగించుకుంటే సీట్లను తగ్గించాల్సిన అవసరం ఉండదని ఒక ఆచార్యుడు సూచించారు.
  • పాలమూరు విశ్వవిద్యాలయంలో మూడు బాలుర హాస్టళ్లలో 500 మంది, ఒక బాలికల హాస్టల్‌లో 400 మంది ఉంటున్నారు. కనీసం 100 మంది అమ్మాయిలకు అధికంగా వసతి కల్పించారు. బాలికలను కనీసం 30 శాతం తగ్గించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్సిటీలో ఇదే పరిస్థితి ఉంది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్‌ కేసులు... ఐదుగురు మృతి

Last Updated : Jun 1, 2020, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.