ETV Bharat / state

bc reservations: సీఎం కేసీఆర్​కు హోం మంత్రి కృతజ్ఞతలు - తెలంగాణ వార్తలు

బీసీ రిజర్వేషన్లు(bc reservations) పొడగించినందుకు సీఎం కేసీఆర్(cm kcr)​కు హోం మంత్రి మహమూద్ అలీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో ముస్లింలు మరో పదేళ్లపాటు రిజర్వేషన్ పొందుతారని పేర్కొన్నారు. ఇది విద్యార్థులకు సువర్ణావకాశమని అన్నారు.

home Minister mohammod ali, cm kcr
హోం మంత్రి మహమూద్ అలీ, సీఎం కేసీఆర్​
author img

By

Published : May 29, 2021, 10:32 PM IST

బీసీ రిజర్వేషన్లను(bc reservations) మరో 10ఏళ్లపాటు పొడిగించినందుకు సీఎం కేసీఆర్‌(cm kcr)కు హోంమంత్రి మహమూద్‌ అలీ కృతజ్ఞతలు తెలిపారు. బీసీ-ఈ ​​కేటగిరీ కింద 4శాతం రిజర్వేషన్లను ముస్లింలు మరో పదేళ్లు పొందగలరని అన్నారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమం గురించి ముఖ్యమంత్రి చాలా ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారి విద్య కోసం చేయాల్సిన కృషిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

రిజర్వేషన్ల పొడిగింపు వల్ల వందలాది మంది ముస్లిం విద్యార్థులకు విద్య, ఉపాధి రంగాల్లో లబ్ధి చేకూరుతుందని, వారి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని హోంమంత్రి అన్నారు. ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు ఒక సువర్ణావకాశం అని అన్నారు. పిల్లల ఉన్నత విద్యకు తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. మక్కా మసీదు ఉద్యోగుల జీతాల చెల్లింపుపై మైనారిటీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్‌తో హోంమంత్రి మాట్లాడారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండి: TS Lockdown: రేపు కేబినెట్​ భేటీ.. లాక్​డౌన్​పై కీలక నిర్ణయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.