ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్యపై హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోల కాల్పుల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
అదే రాష్ట్రంలో గత నెలలో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అసువులు బాసిన ఘటన మరువకముందే.. తిరిగి ఈ ఘటన చోటుచేసుకోవడం తనను కలచివేసిందన్నారు. జవానుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.