ETV Bharat / state

ఉక్కు వంతెన ప్రారంభం... తప్పనున్న ట్రాఫిక్​ సమస్యలు

హైదరాబాద్ పంజాగుట్టలో ఉక్కు వంతెనను హోంమంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్​ ప్రారంభించారు. దీనితో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మార్గంలో ట్రాఫిక్ సమస్య తీరనుంది.

Home Minister  Mahmoud Ali opened the steel bridge in Panjagutta Hyderabad
పంజాగుట్టలో ఉక్కు వంతెనను ప్రారంభించిన హోంమంత్రి
author img

By

Published : Jun 19, 2020, 11:22 AM IST

Updated : Jun 19, 2020, 2:24 PM IST

దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన టెక్నాలజీ వాడుకుని హైదరాబాద్​ పంజాగుట్ట ఉక్కు వంతెనను నిర్మించారని హోం మంత్రి మహమూద్​ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్​ సమస్యలు తొలిగిపోవడానికి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుందని తెలిపారు. పంజాగుట్ట ఉక్కు వంతెనను హోంమంత్రి మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్ కలిసి​ ఇవాళ ప్రారంభించారు. లాక్​డౌన్​ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకుని రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేశారని స్పష్టం చేశారు.

ప్రపంచంలో ప్రతి ఒక్కరు హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఇక్కడి పోలీస్​ వ్యవస్థ, భద్రత వల్ల ఇక్కడికి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. 6 కోట్ల రూపాయల బల్దియా నిధులతో పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద ఈ ఉక్కు వంతెన నిర్మాణం జరిగింది. పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మార్గంలో ఇకపై ట్రాఫిక్ సమస్య తీరనుంది

ఉక్కు వంతెన ప్రారంభం... తప్పనున్న ట్రాఫిక్​ సమస్యలు

ఇదీ చదవండి: మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!

Last Updated : Jun 19, 2020, 2:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.