జైళ్లశాఖ సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి ప్రతిష్టను పెంచాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. జైళ్లలో ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. చంచల్‌గూడ జైలు ప్రాంగణంలో శిక్షణ పొందిన స్టిపెండరీ వార్డర్ పాసింగ్ ఔట్ పరేడ్‌కు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శిక్షణ పూర్తైన వార్డర్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరిశ్రమలు, పెట్రోల్ బంకుల నిర్వహణ ద్వారా జైళ్లశాఖ రూ.20 కోట్ల లాభాలను అర్జించిందని హోంమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వార్డర్లకు బహుమతులు అందజేశారు.
ఇదీ చూడండి : ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉంది: కేటీఆర్