ETV Bharat / state

గడువులోగా పోలీసు కార్యాలయ భవనాలను పూర్తిచేయాలి: మహమూద్ అలీ - తెలంగాణ తాజా వార్తలు

నిర్మాణంలో ఉన్న పోలీస్ శాఖ భవనాలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ సమీక్షించారు. కొన్ని జిల్లాల్లో పోలీస్ కార్యాలయాలు, కమిషనరేట్ కార్యాలయాలు పూర్తికాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.

Telangana news
హైదరాబాద్​ వార్తలు
author img

By

Published : Jun 2, 2021, 10:32 AM IST

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న పోలీస్​ కార్యాలయాలను త్వరితగతిన పూర్తి చేయాలని హోంమంత్రి మహమూద్​ అలీ పేర్కొన్నారు. సిద్దిపేట కమిషనర్ కార్యాలయం, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం భవనాలు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. సిరిసిల్ల, సూర్యాపేట, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల పోలీసు కార్యాలయాలతో పాటు రామగుండం కమిషనర్ కార్యాలయం నిర్మాణదశలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్​లోని కాచిగూడ, మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల భవనాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

ఎస్ఆర్​నగర్, ఆసిఫ్ నగర్, చాంద్రాయణగుట్ట, కాచిగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్​లో భవనాలు త్వరలో పూర్తి కానున్నాయని హోం మంత్రికి తెలియజేశారు. దీనిపై స్పందించిన హోం మంత్రి మహమూద్ అలీ.. గడువులోగా పోలీసు కార్యాలయ భవనాలను పూర్తిచేయాలని ఆదేశించారు. త్వరితగతిన నిర్మాణం పూర్తయితే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సమీక్షలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంఛార్జి ఎండి సంజయ్ కుమార్ జైన్, కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ విజయ్ కుమార్ తదితరుల పాల్గొన్నారు.

ఇదీ చూడండి: School fees : వచ్చే సంవత్సరమూ పాత ఫీజులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.