హోంమంత్రి మహమూద్ అలీ తమ చేతుల మీదుగా కార్వాన్ నియోజకవర్గంలో తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న రెండు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయని.. నాయకులు సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు. తెలంగాణ విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు అనేక రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్కు మాత్రమే దక్కుతుందని మంత్రి మహమూద్ అలీ అన్నారు.
ఈ సందర్భంగా 50 మంది తెరాస పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ నియోజకవర్గ తెరాస ఇన్చార్జి జీవన్ సింగ్, కార్పొరేటర్ మిత్రకృష్ణ, సీనియర్ నాయకులు ముత్యాల భాస్కర్, కావూరి వెంకటేష్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెరాస కార్యకర్తల జేబుల్లోకి వరదసాయం: డీకే అరుణ