ETV Bharat / state

Amit Shah Tirupati Tour: నేడు ఏపీకి అమిత్​షా.. మూడు రోజుల పర్యటన - ఏపీకి అమిత్ షా

మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతికి (Amit Shah Tirupati Tour) రానున్నారు. సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.

Amit shah Tirupati Tour
ఏపీకి అమిత్​షా
author img

By

Published : Nov 13, 2021, 11:00 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలోని మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతి (Amit Shah Tirupati Tour)కి రానున్నారు. సాయంత్రం 7.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా తాజ్ హోటల్​కు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాఫ్టర్లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణభారతి ట్రస్టు , ముప్పవరపు ఫౌండేషన్లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు.

మధ్యాహ్నం స్వర్ణభారతి ట్రస్టు 20 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్ హోటల్​కు చేరుకుంటారు. అదే హోటల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్ హోటల్లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40 కు దిల్లీ చేరుకుంటారు.

ఇదీ చదవండి: Harish Rao on Fuel price: '16సార్లు పెంచి... ఒక్కసారి తగ్గించి.. మేలు చేసినట్లు కేంద్రం డ్రామా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.