ETV Bharat / state

Gulab Cyclone Effect: ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, విద్యాసంస్థలకు సెలవు - రాష్ట్రంలో నేడు పాఠశాలలు సెలవు

గులాబ్​ తుపాను(Gulab Cyclone Effect) ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా సెలవు(holiday for government and private offices) ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవు కారణంగా ఇవాళ, రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. వర్షాల కారణంగా సెలవు నుంచి అత్యవసర శాఖలకు మినహాయింపు ఇచ్చారు.

holiday-for-government-and-private-offices-and-educational-institutions-on-today

author img

By

Published : Sep 28, 2021, 8:19 AM IST

Updated : Sep 28, 2021, 8:42 AM IST

గులాబ్‌ తుపాను(Gulab Cyclone Effect) ప్రభావ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవైటు కార్యాలయాలకు మంగళవారం సెలవుదినం(holiday for government and private offices)గా సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక, పురపాలక, పంచాయతీరాజ్‌, నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖలను సెలవు(Gulab Cyclone Effect) నుంచి మినహాయించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాలతో ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

శాసనసభ, మండలి సమావేశాలు వాయిదా..

మరోవైపు తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలకు సైతం మూడు రోజుల పాటు వాయిదా వేశారు. వచ్చే నెల మొదటి తేదీ శుక్రవారం నాడు మళ్లీ ఉభయసభలు ఉదయం పది గంటలకు సమావేశమవుతాయని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సమావేశాల ముగింపు సందర్భంగా ఉభయసభలు మంగళవారం సమావేశమవుతాయని పోచారం, భూపాల్‌రెడ్డిలు ప్రకటించారు. రాష్ట్రంలో వరదల ఉద్ధృతి దృష్ట్యా తమ నియోజకవర్గ ప్రజలను ఆదుకునేందుకు వీలుగా సమావేశాలను వాయిదా వేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోచారం, భూపాల్‌రెడ్డిలను కోరారు. దీనిపై వారు స్పందించి సీఎం కేసీఆర్‌, విపక్షాల నేతలను సంప్రదించారు. వారు కూడా ఆమోదం తెలపడంతో ఉభయ సభలను మూడు రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: Heavy Rain in Telangana : తెలంగాణ అతలాకుతలం.. హైదరాబాద్​ జలమయం... నేడూ భారీ వర్షాలు

Last Updated : Sep 28, 2021, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.