ETV Bharat / state

కొత్త వసంతానికి స్వాగతం పలికే హోలీ.. కరోనా దృష్ట్యా సాదాసీదాగానే! - తెలంగాణ వార్తలు

నూతన ప్రకృతికి స్వాగతం పలుకుతూ.... ఫాల్గుణ పూర్ణిమ రోజు వైభవంగా జరుపుకునే హోలీ వేడుకలు ఈ సారి సాదాసీదాగా జరిగాయి. కరోనా దృష్ట్యా ప్రభుత్వ సూచనలతో... చాలా చోట్ల కాలనీల్లో, తమ ఇళ్ల వద్దే ఆనందోత్సవాలతో రంగుల పండుగ జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు.... అందరి జీవితాలు మరింత రంగులమయం కావాలని ఆకాంక్షించారు.

holi celebrations 2021, holi celebrations in telangana
హోలీ వేడుకలు 2021, తెలంగాణలో హోలీ వేడుకలు
author img

By

Published : Mar 28, 2021, 7:28 PM IST

హోలీ వేడుకలు 2021, తెలంగాణలో హోలీ వేడుకలు

ప్రకృతితో మమేకమై కుల, మతాలకతీతంగా.... చిన్నా పెద్దా రంగుల్లో తేలియాడే హోలీ వేడుకలను రాష్ట్ర ప్రజలు ఉల్లాసంగా జరుపుకున్నారు. చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలి వేడుకలను ప్రభుత్వ ఆంక్షల మేరకు ఆనందోత్సవాల మధ్య రంగులు చల్లుకున్నారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం అందించాలని వారు ఆకాంక్షించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున పండగల వేళ ప్రజలందరూ నిబంధనలు పాటించాలని వారు కోరారు. రాష్ట్ర ప్రజలకు మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి, ఈటల రాజేందర్‌, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని వారు పేర్కొన్నారు.

రామయ్య డోలోత్సవం

హోలీ పూర్ణిమ సందర్భంగా భద్రాద్రి రామయ్యకు డోలోత్సవం వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు ఫల, పుష్ప, ధూప, దీప నైవేద్యాలు సమర్పించిన అర్చకులు... అనంతరం ఉయ్యాలలో వేంచేసిన సీతారాములకు రంగులు చల్లి వసంతోత్సవం నిర్వహించారు. స్వామివారికి చల్లిన వసంతాన్ని భక్తులపై చల్లడంతో... ఆలయప్రాంగణంలో సందడి నెలకొంది.

ఉత్సాహంగా వేడుకలు

వరంగల్‌ నగరవాసులు హోలీ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. చాలాచోట్ల కరోనా కారణంగా రంగుల పండుగకు దూరంగా ఉన్నా.... పిల్లలు మాత్రం వీధుల్లో కేరింతలు కొట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో కరోనా నిబంధనలతో రంగుల పండుగ జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం సూర్యతండాలో జరిగిన హోలీవేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్‌ పాల్గొని... గిరిజనులతో కలిసి బంజారా నృత్యాలు చేశారు. కరీంనగర్‌లో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

రంగులతో కేరింతలు

నిజామాబాద్‌లో కాలనీల నుంచి బయటికి రాకుండా హోలీ పండుగ జరుపుకున్నారు. బాల్కొండలో కామదహనం అనంతరం... ఉదయం నుంచి చిన్నాపెద్ద తేడా లేకుండా వేడుకల్లో మునిగితేలారు. ఆదిలాబాద్‌లో కరోనా ఆంక్షల నడుమ హొలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పురవీధుల్లో కాకుండా ఇంటి వద్దనే యువతులు, మహిళలు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హోలీవేడుకల్లో సందడి చేశారు. నిర్మల్‌లో యువతీయువకులు, చిన్నారులు రంగుడబ్బాలతో వీధుల్లో సంచరిస్తూ ఒకరికి ఒకరు చల్లుకుని... కేరింతలు కొట్టారు.

ఇదీ చదవండి: మహిళల కోసం పింక్​లూ.. పదో తరగతి చిన్నారి ఆవిష్కరణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.