ETV Bharat / state

ఇందిరా పార్కులో మేళతాళాలతో హోలీ సంబురాలు - హోలీ సంబురాలు

భాగ్యనగరంలో హోలీ సంబురాలు ఘనంగా సాగుతున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్నారు. హైదరాబాద్​ ఇందిరా పార్కులో మేళతాళాల మధ్య హోలీ వేడుకలు అంబరాన్నంటాయి.

ఉత్సాహంగా సంబురాలు
author img

By

Published : Mar 21, 2019, 1:41 PM IST

వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు
హైదరాబాద్​ ఇందిరా పార్క్​ఆవరణలో వాకర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఒకరిపై ఒకరు సహజ సిద్ధ రంగులు చల్లుకుంటూ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు ఆటల్లో పాల్గొని సందడి చేశారు.

ఎమ్మెల్యే సందడి..

హోలీ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​, మాజీ ఎంపీ అంజన్​కుమార్​ యాదవ్​, కార్పొరేటర్​ శ్రీనివాస్​రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులతోనే హోలీ జరుపుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి :డిజిటల్​ వేదిక... సమస్త సమాచార దీపిక

Note: Script Ftp
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.