HMRL Started Preparatory Old City Metro Project Works : హైదరాబాద్ పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు.. మెట్రో రైలు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 5.5 కిలోమీటర్ల వరకు ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంజీబీఎస్ నుంచి దారుల్‌షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దైరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు చేపట్టనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
Old City Metro as 5 Stations : ఈ మెట్రో రైలు మార్గంలో.. మొత్తం 5 స్టేషన్లు ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌లకు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. వాటికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా.. రెండు స్టేషన్‌లకు వాటిపేరు పెట్టడం జరిగిందని వివరించారు. మరోవైపు ఈ మార్గంలో 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 స్మశానవాటికలు, 6 చిల్లాలు ఉన్నాయని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
Old City Metro Hyderabad : మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాలుగు మతపరమైన నిర్మాణాలను కాపాడేందుకు.. మెట్రో అలైన్‌మెంట్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు.. రోడ్డు విస్తరణ 80 అడుగులకు పరిమితం చేయబడుతుందని చెప్పారు. కానీ నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
ఇందులో భాగంగానే స్టేషన్‌ల ఏర్పాటు స్థానాల్లో మాత్రం.. రహదారిని 120 అడుగులకు విస్తరించడం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఈ విస్తరణలో భాగంగా.. ఎఫెక్ట్ అయ్యే దాదాపు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ ప్రారంభించామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక నెలరోజుల్లో వాటికి భూ సేకరణ నోటీసులు జారీ చేయనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
Old City Metro Line : ఇటీవలే ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గం నిమిత్తం 5.5 కిలోమీటర్ల మెట్రోరైలు నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు స్పష్టం చేసినట్లు.. మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మెట్రో రైలు తొలివిడత కింద 69.2 కిలోమీటర్లు నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ.. వివిధ అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ మార్గాన్ని నిర్మించే విషయంలో చేతులెత్తేసింది. మరోవైపు రాయదుర్గంతోపాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడా కలిపి సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించటంతో పాటు.. నిలిచిపోయిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో విస్తీర్ణం 74.7 కిలోమీటర్లకు అవుతుంది.
ఇవీ చదవండి: KTR Delhi tour latest news : 'మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతివ్వండి'
Old City Metro Hyderabad : ఓల్డ్‌సిటీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పట్టాలెక్కనున్న మెట్రో