ETV Bharat / state

HMDA review: 2021లో వ్యూహాత్మక అభివృద్ధితో దూసుకెళ్లిన హెచ్​ఎండీఏ - హెచ్‌ఎండీఏ

HMDA review: విశ్వనగరం హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో శివారు ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి నగర బాహ్య వలయ రహదారి లోపల, బయట ఉన్న ప్రాంతాల్లో వ్యూహాత్మక అభివృద్ధి పనులతో పాటు సుందరీకరణ ప్రాజెక్టులను హెచ్‌ఎండీఏ చేపట్టింది. మూడేళ్లకాలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, వీధిదీపాలు, లాజిస్టిక్ పార్కులు, పలు ప్రాంతాల్లో మురుగునీరు చెరువుల్లోకి రాకుండా మళ్లింపు వంటి అభివృద్ధి చేపట్టింది. ఉప్పల్ భగాయత్ వద్ద 72 ఎకరాల విస్తీర్ణంలో ఫేజ్-2గా లేఅవుట్ ఏర్పాటు చేసింది. బహుళార్ధసాధక ఉపయోగం కోసం పెద్ద సైజు ప్లాట్లతో ఎత్తైన భవనాల కోసం విశాలమైన రోడ్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ లేఅవుట్‌లో బ్యాలెన్స్ ఏరియాను ఫేజ్-3గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ వర్గాలు ప్రకటించాయి.

Hyderabad Development: భాగ్యనగర శివారు ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై హెచ్​ఎండీఏ ప్రత్యేక దృష్టి

author img

By

Published : Dec 31, 2021, 4:43 PM IST

HMDA review: హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక దృష్టితో గత మూడు సంవత్సరాల్లో రూ. 2వేల కోట్ల వ్యయంతో బాహ్య వలయ రహదారి లోపల, బయట ఉన్న ప్రాంతాల్లో వ్యూహత్మక అభివృద్ధి పనులు, సుందరీకరణ ప్రాజెక్టులు చేపట్టింది. వాటిలో పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. బాలానగర్ వద్ద 6-లేన్ 2 వే ఫ్లైఓవర్, నర్సాపూర్ x రోడ్డు, ఫతేనగర్ జంక్షన్లను దాటుతూ 1 కిలోమీటరు పొడవునా ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటికే ఉన్న 30 మీటర్ల వెడల్పు నుంచి 45 మీటర్ల వెడల్పు వరకు ఇరువైపులా సక్రమంగా అభివృద్ధి చెందుతున్న సర్వీస్ రోడ్ల విస్తరణ కూడా ఉంది.

ట్యాంక్​బండ్​ను సుందరంగా తీర్చిదిద్దారు..

HMDA: గ్రానైట్ ఫ్లోరింగ్‌తో ట్యాంక్​బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దింది. ఇప్పటికే ఉన్న రైలింగ్‌ను అలంకారమైన రెయిలింగ్‌తో భర్తీ చేసి వీధి దీపాలు, బెంచీలు మొదలైనవి విశ్రాంతి సమయం కోసం వచ్చే సందర్శకులను ఆకర్శిస్తున్నాయి. ఫుట్‌పాత్ మెరుగుదల, వాక్‌వే లైటింగ్ 6 కిలోమీటర్ల పొడవునా... వీడీసీసీ రోడ్డు వేయడం ద్వారా నెక్లెస్ రోడ్డు కూడా మెరుగులు దిద్దింది. నగర శివారు బాటసింగారం వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో కూడిన రెండు లాజిస్టిక్ పార్కులు, 20 ఎకరాల విస్తీర్ణంలో మంగళ్‌పల్లి వద్ద లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్ ఆపరేటర్లకు వేర్ హౌసింగ్, డార్మిటరీలు, పార్కింగ్, స్టేషన్, ఫుడ్ కోర్ట్ , ఇంధనం సక్రమంగా అందించడం కోసం వన్ స్టాప్ సౌకర్యంతో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

ఓఆర్​ఆర్​పై లైటింగ్​

Lighting on ORR: హైదరాబాద్ చుట్టూ 136 కిమీ ఓఆర్‌ఆర్‌ సెంట్రల్ మీడియన్‌పై ఎల్​ఈడీ లైట్లతో మెయిన్ క్యారేజ్ వేలో లైటింగ్ ఏర్పాటు చేసింది. రాత్రి సమయంలో ప్రమాదాలు నివారించేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం హైమాస్ట్ లైట్లతో 15 ఇంటర్‌ ఛేంజ్‌ల పనులన్నీ పూర్తయ్యాయి. ఆర్‌ఎఫ్‌ఐడీ వ్యవస్థతో టోల్ నిర్వహణలు ఏర్పాటు చేసింది. ఉప్పల్, ఏఎస్‌ రావు నగర్, ఐడీపీఎల్‌ కాలనీలో మూడు ఎఫ్ఓబీలు పూర్తయ్యాయి.

రెండు స్కైవాక్​లు

Hyderabad metropolitan development authority: నగరంలో ఉప్పల్, మెహిదీపట్నంలో రెండు స్కైవాక్‌లు ఎలివేటెడ్ నడక మార్గాల పనులు చురుకుగా సాగుతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా జంక్షన్‌లోని ప్రతి వైపు నుంచి పాదచారుల కదలిక కోసం పురోగతిలో ఉన్నాయి. బస్ స్టాప్‌లకు నేరుగా అనుసంధానం చేయబోతున్నారు. ఉప్పర్‌పల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి ఉప్పర్‌పల్లి వద్ద అప్ ర్యాంప్, డౌన్ ర్యాంప్‌లు చేపట్టారు. లక్ష్మీనగర్ వద్ద డౌన్ ర్యాంప్‌ నిర్మించాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ఇది భూమి కొరత కారణంగా పూర్తిగా ఆలస్యమవుతోంది.

నియోపోలిస్​ లేఅవుట్​ అభివృద్ధి

kokapet neopolis layout: కోకాపేట్‌లో 533 ఎకరాల విస్తీర్ణంలో నియోపోలిస్ లేఅవుట్‌గా పేరుపొందిన మౌలిక సదుపాయాల అభివృద్ధి బహుళార్ధ సాధక వినియోగానికి సంబంధించి ఎత్తైన భవనాల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబడింది. లేఅవుట్ నుంచి ఓఆర్‌ఆర్‌కు వేగవంతమైన కనెక్టివిటీ కోసం అంతటా ట్రంపెట్, నార్సింగి వద్ద అప్, డౌన్ ర్యాంప్‌లు ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌ వెంబడి పెరుగుతున్న రద్దీ పరిగణనలోకి తీసుకుని డివైడర్‌తో ఇప్పటికే ఉన్న 2-లేన్ నుంచి 4-లేన్‌ల వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్‌ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. టీఎస్‌పీఏ ఇంటర్‌ ఛేంజ్ నుంచి కొల్లూరు ఇంటర్‌చేంజ్ వరకు 46 కి.మీ పొడవునా ఈ పనులు సాగుతున్నాయి.

ఓఆర్​ఆర్​లో అత్యవసర సంరక్షణ కోసం..

రోడ్డు వినియోగదారుల భద్రత, ఓఆర్‌ఆర్‌లో అత్యవసర సంరక్షణ కోసం 6 ప్రదేశాలలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, 10 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది. మత సామరస్యం పెంపొందించడానికి ప్రతి వర్గానికి ప్రత్యేక స్థలంతో ఫతుల్లాగూడలో ఒకే చోట హిందూ, ముస్లిం, క్రైస్తవుల కోసం ఒక మోడల్ శ్మశాన వాటిక పనులు సాగుతున్నాయి. అధునాతన ఎలక్ట్రికల్ శ్మశాన వాటిక, శీతల గిడ్డంగి, ప్రార్థనా మందిరాలు, ఇతర సౌకర్యాలతో ఈ పనులు అతి త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది.

ప్రణాళికలు రచిస్తున్న హెచ్‌ఎండీఏ

hmda plans: మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం స్థిరమైన ప్రణాళికలు రచిస్తున్న హెచ్‌ఎండీఏ... మున్సిపాలిటీల అభ్యర్థన మేరకు పరిధిలో చుట్టుపక్కల అప్రోచ్ రోడ్లు, మురుగునీరు పారడానికి డ్రైన్లు, లైటింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టింది. బాచుపల్లి నుంచి మల్లంపేట మీదుగా బౌరంపేట వరకు రోడ్డు విస్తరణ, మల్లంపేట వద్ద ఓఆర్‌ఆర్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంప్‌లతో రహదారిని మెరుగుపరిచింది. ఎల్‌బీ నగర్ ప్రాంతంలో ల్యాండ్‌స్కేప్ పార్కుల సుందరీకరణ, కొత్వాల్‌గూడలో ఎకో పార్క్, హుస్సేన్‌సాగర్ వద్ద నైట్ బజార్, ఉప్పల్ భగాయత్ వద్ద లేఅవుట్, హెచ్‌ఎండీఏ ప్రాంతంలో రెండు పడక గదుల సముదాయాల వరకు అప్రోచ్ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జల్​పల్లి వద్ద సరస్సు సుందరీకరణ, పీ7 రహదారిపై ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ సుందరీకరణ, కోకాపేట్, ఇతర ప్రదేశాల్లో కనెక్టివిటీ రోడ్లు, లింకులు, మీర్ ఆలం ట్యాంక్ వద్ద కేబుల్ స్టే బ్రిడ్జి, ఇతర ప్రధాన జంక్షన్లలో స్కైవాక్‌లు, లాజిస్టిక్ పార్కులు, లేఅవుట్లు చేపట్టింది. త్వరలో పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.