HMDA-lands-selling-at-huge-price-in-Budvel : హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని భూములకు రెక్కలు వస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో బుద్వేల్ భూముల(Budvel Lands) వేలం కొనసాగుతోంది. ఇక్కడ కూడా అధిక స్థాయిలో భూములు(Lands) ధర పలుకుతున్నారు. బుద్వేల్ భూముల వేలంలో 100.01 ఎకరాల్లో మొత్తం 14 ప్లాట్లు రూ.3625.73 కోట్లు ఆదాయం వచ్చింది. అత్యధికంగా మూడు ప్లాట్లు రూ.40 కోట్ల కంటే ఎక్కువ ధర పలికాయి. అత్యధికంగా ఎకరా ధర రూ.41.75 కోట్లు పలకగా.. అత్యల్పంగా ఎకరా ధర రూ.33.25 కోట్లు ధర పలికింది. ఎకరాకు రూ.36.25 కోట్ల ధర పలికింది.
తొలిసెషన్ లో 1, 2, 4, 5, 8, 9, 10 ప్లాట్లకు ఈ-వేలం(E-Auction) జరిగింది. బుద్వేల్ భూముల తొలి సెషన్ లో 58.19 ఎకరాల ఈ-వేలంపాట ఎకరా ధర ప్లాట్స్ వైజ్‌గా జరిగింది. ఈ వేలంలో రూ.2061 కోట్ల ఆదాయం వచ్చింది. ప్లాట్ నంబర్ 1 ఎకరం ధర రూ.34.50 కోట్లు, ప్లాట్ 2 ఎకరం ధర రూ.33.25 కోట్లు, ప్లాట్ 5 ఎకరం ధర రూ.33.25 కోట్లు, ప్లాట్ 8 ఎకరం ధర రూ.35.50 కోట్లు, ప్లాట్ 9 ఎకరం ధర రూ.33.75 కోట్లు, ప్లాట్ 10 ఎకరం ధర రూ.35.50 కోట్లు పలికాయి. ఇవాళ మొత్తం 100 ఎకరాలకు ఈ-వేలం హెచ్ఎండీఏ నిర్వహిస్తోంది. అందులో 58.19 ఎకరాలు తొలి సెషన్ పూర్తయ్యింది. మిగిలిన 41.81 ఎకరాలకు సెకండ్ సెషన్ వేలం పాట మొదలై.. రూ.1564 కోట్లు ఆదాయం వచ్చింది.
Mokila Layout Auction Hyderabad : మోకిల ప్లాట్ల ఈ-వేలానికి విశేష స్పందన.. మూడురెట్లు ధర అధికం
Kokapet Lands E-Auction In Hyderabad : అలాగే అంతకు ముందు హైదరాబాద్, రంగారెడ్డిలో నిర్వహించిన హెచ్ఎండీఏ ఈ-వేలంలో భూములు రికార్డు ధరను పలికాయి. కోకాపేట భూములైతే గత రికార్డులను చేరిపేశాయి. 45.33 ఎకరాల నియో పొలిస్ భూములకు వేలంలో ఏకంగా ఎకరా భూమి రూ.100.75 కోట్ల ధర పలికింది. అత్యల్పంగా ఎకరం భూమి రూ.67.25 కోట్లు పలికింది. ఈ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.3,319.60 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఈ భూముల కోసం స్థిరాస్తి సంస్థలు నువ్వానేనా అన్నట్లు పోటాపోటీ పడ్డాయి. ఇప్పటికే తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా అత్యధికంగా ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడుపోయింది.
HMDA Layouts Mokila Lands E-Auction 2023 : హైదరాబాద్ నగర శివారులో ఉన్న మోకిలలో 165 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్లో తొలి విడత 15,800 చదరపు గజాల్లోని 50 ప్లాట్లను రూ.121.40 కోట్లకు విక్రయించారు. దీంతో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. రెండో విడతలో 50 నుంచి 100 ప్లాట్ల ఈ-వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమవుతుంది.
HMDA e-Auction Shabad Lands : రంగారెడ్డిలోని షాబాద్‌లోని ప్లాట్లను కూడా హెచ్ఎండీఏ విక్రయించింది. 50 ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం ద్వారా చదరపు గజం గరిష్ఠంగా రూ.27 వేలుగా.. కనిష్ఠంగా రూ.18 వేలుగా పలికింది. దీంతో 50 ప్లాట్లను రూ.33.6 కోట్లకు విక్రయించడంతో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది.
Kokapet Land Auction : కోట్లు కురిపించిన కోకాపేట నియోపోలీస్ భూముల వేలం.. ఎకరానికి ఎంతంటే ?
HMDA Auction Shabad Lands In Rangareddy : షాబాద్‌లోని ప్లాట్ల ఈ-వేలం.. ఏకంగా రూ.33.06 కోట్ల ఆదాయం