రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు సర్కిల్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మునిసిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ పరిశీలించారు. ఓఆర్ఆర్ 153 కిలోమీటర్ వద్ద దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో హరిత సుందరీకరణ పనులు చేపట్టారు. పనులు వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులను ఆయన ఆదేశించారు.
ఐకియా సర్కిల్ వద్ద హెచ్ఎండీఏ చేస్తున్ శంషాబాద్ ఇంటర్‌ఛేంజ్ బ్యూటిఫికేషన్ పనులను సైతం ఆయన పర్యవేక్షించారు. అంతకు ముందు నార్సింగి వద్ద గల అక్షయపాత్ర ఫౌండేషన్‌ను సందర్శించారు. ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి మెగా కిచెన్‌ను ఆయన పరిశీలించారు.
ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్