మనుషి మనసును లగ్నం చేస్తే.... అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. మేడ్చల్ సమీపంలోని కండ్లకోయ సాయిగీత ఆశ్రమంలో జరిగిన సర్వదోష నివారణ కార్యక్రమానికి దత్తాత్రేయ హాజరయ్యారు. భక్తులకు సద్గురు సాయికుమార్ బాబా తన ప్రవచనలు బోధించారు. మనిషి మనసును లగ్నం చేస్తే అసాధ్యమైన పనులు సుసాధ్యమవుతాయని దత్తాత్రేయ తెలిపారు. వందల్లో ఆయుర్వేద మొక్కలు ఉండి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరవడం గొప్ప విషయమన్నారు. సాయికుమార్ బాబా ప్రవచనములు అన్ని మతాలను ఒక్కతాటి పైకి తీసుకొచ్చేలా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!