ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మాణిక్యాల రావుకు కరోనా సోకిందనే వార్త తెలిసిన తర్వాత.. ఆయనతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఇంతలో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.
మాణిక్యాలరావు 1981లో పశ్చిమ గోదావరి జిల్లా తడిపెల్లి గూడెంలో యువ భాజపా కార్యకర్తగా పరిచయమయ్యారని దత్తాత్రేయ పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు వారి కుటుంబంతో తనకు అత్యంత సాన్నిహిత్యం ఉన్నట్లు వివరించారు. అతని మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీరని లోటన్న ఆయన.. వారి మృతిపట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి శక్తిని ఇవ్వాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీచూడండి: బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!