దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దత్తాత్రేయ కుమారుడు బండారు వైష్ణవ్ స్మారకర్థం ఓయూ ఫుట్ బాల్ గ్రౌండ్లో వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు వైష్ణవ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు.
బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు దత్తాత్రేయ... భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావుతో కలిసి హాజరయ్యారు. యువత శారీరకంగా, మానసికంగా ఎదగడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని దత్తాత్రేయ పేర్కొన్నారు. వీబీ ఫౌండేషన్ పేరు మీద మున్ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మ్యాచ్‌లో మొదట విజేతగా నిలిచిన జట్టుకు రూ.50,000 నగదుతో పాటు షీల్డ్, రెండో బహుమతికి 20,000 నగదును, షీల్డ్‌ను బహుకరించారు.
ఇదీ చూడండి: భారత్ X ఇంగ్లాండ్: నిర్ణయాత్మక పోరులో గెలుపెవరిది?