అనారోగ్యంతో మృతి చెందిన కె.లక్ష్మణ్ సోదరుడు కోవ శ్రీనివాస్, అత్త కమలమ్మ అకాల మరణం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా నేతలు పరామర్శించారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు.

జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పరామర్శించిన వారిలో గవర్నర్, కేంద్రమంత్రితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉన్నారు.
