కుమురం భీం 80వ వర్ధంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు కుమురం భీం అని దత్తాత్రేయ అన్నారు. జల్-జంగల్-జమీన్ అంటూ నినదించిన స్ఫూర్తిదాత అని పేర్కొన్నారు. గోండులకు భూమి మీద అధికారం కావాలని నైజాం ప్రభుత్వంపై గెరిల్లా పోరాటం చేసి గడగడలాడించాడన్నారు. ఈ పోరాటంలో పెద్దఎత్తున గోండులు పాల్గొన్నారని... ఇది నైజాం ప్రభుత్వానికి పెను సవాలుగా పరిణమించిందన్నారు.
భారీ సంఖ్యలో బలగాలు ముట్టడించిన కుటిలమైన యుద్ధంలో కుమురం భీం నేలకొరిగాడని బండారు దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను, భూములను, వారి సంస్కృతిని పరిరక్షించాలని ఆయన కోరారు. వారిని అభివృద్ధిలో భాగం అయ్యేలా చేయడమే కుమురం భీంకు ఘటించే నిజమైన శ్రద్ధాంజలి అని దత్తాత్రేయ అన్నారు.
ఇవీ చూడండి: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం: శ్రీనివాస్ గౌడ్