ETV Bharat / state

‘సర్వ సమానత్వం కోసం మహావీర్​ ఎంతో కృషి చేశారు’ - మహావీర్ జయంతి

మ‌హావీర్​ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అహింస, సత్యం అనే అంశాల‌ను మాన‌వాళికి బోధించిన మ‌హావీరుని జీవిత సందేశం అంద‌రికీ ఆద‌ర్శమని పేర్కొన్నారు.

Himachal Governor
Himachal Governor
author img

By

Published : Apr 25, 2021, 3:55 PM IST

భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో, జైన మత ఆవిర్భావం విలక్షణమని అన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. మహావీర్ జయంతిని పురస్కరించుకుని సిమ్లాలోని రాజ్ భవన్​లో వర్ధమానుడికి శ్రద్ధాంజలి ఘటించారు. మహావీరుడి జీవిత విశేషాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

భారతీయ సమాజంలో ఆరవ శతాబ్దం నాటి వర్ణ వ్యవస్థ, సాంఘిక, సామాజిక రుగ్మతలపై పోరాడుతూ సర్వ సమానత్వం కోసం మహావీరుడు ఎంతో కృషి చేశారని దత్తాత్రేయ కొనియాడారు. మహావీరుని హాయంలోనే జైనమతానికి విశేష ప్రాధాన్యత లభించిందన్నారు. వృక్షాలకు సైతం ప్రాణం ఉంటుందని చెప్పేవారని గుర్తు చేశారు. మహావీరుని బోధనల స్ఫూర్తితో అందరూ సహనంతో వ్యవహరించాలన్నారు. కొవిడ్ రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. స్వీయ క‌ట్టుబాట్లు, నిబంధ‌న‌లను అనుస‌రిస్తూ వైరస్​ను​ జ‌యించాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆక్సిజన్, కొవిడ్ పడకల కొరత లేదు : కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.