ETV Bharat / state

ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన ఉన్నత విద్యామండలి - హైదరాబాద్​ వార్తలు

Higher Education Council announces entrance examination schedule
ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన ఉన్నత విద్యామండలి
author img

By

Published : Feb 12, 2021, 3:17 PM IST

Updated : Feb 12, 2021, 7:59 PM IST

15:16 February 12

ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ ప్రకటించిన ఉన్నత విద్యామండలి

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్​ను జులై 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈసెట్ జులై 1న, పీజీఈసెట్ జూన్ 20 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఐసెట్, ఎడ్​సెట్, లాసెట్, పీఈసెట్ తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. గతంలో నిర్వహించిన విశ్వ విద్యాలయాలకే మళ్లీ  ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించారు.

కన్వీనర్లు వీరే

ఎంసెట్, ఈసెట్​ను జేఎన్టీయూహెచ్, ఐసెట్, కాకతీయ యూనివర్సిటీ, పీజీ ఈసెట్, ఎడ్​సెట్, లాసెట్ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి, పీఈసెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీకి బాధ్యతలు అప్పగించింది.  పీజీఈసెట్, ఎడ్​సెట్ మినహా మిగతా ఎంట్రన్సుల కన్వీనర్లను ఈ విద్యా సంవత్సరం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఎంసెట్ కన్వీనర్​గా జేఎన్టీయూహెచ్ రెక్టార్ గోవర్దన్, ఈసెట్​కు జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ వెంకట రమణారెడ్డి, ఐసెట్​కు కేయూ ప్రొఫెసర్ కె.రాజి రెడ్డి, పీజీఈసెట్​కు ఓయూ ప్రొఫెసర్ పి.లక్ష్మినారాయణ, ఎడ్​సెట్​కు ఓయూ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, లాసెట్, పీజీఎల్ సెట్​కు ఓయూ ప్రొఫెసర్ జీబీ రెడ్డి, పీఈసెట్​కు ఓయూ ప్రొఫెసర్ వి.సత్యనారాయణను నియమించారు.

వెయిటేజీ యథాతథం

ఎంసెట్​లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70 శాతం.. మొదటి సంవత్సరంలో పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే నిర్ణయించింది. జేఈఈ తరహాలోనే ఈ ఏడాది ఎంసెట్​లో ఛాయిస్ ఇవ్వనున్నారు. ఎన్ని ప్రశ్నలు అదనంగా ఇవ్వాలో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ యథాతథంగా కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. 

ఇదీ చదవండి: రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్

Last Updated : Feb 12, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.