ETV Bharat / state

'జీవోలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు'

ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదన్న.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

author img

By

Published : Sep 18, 2019, 5:48 PM IST

హైకోర్టు

జీవోలను ప్రభుత్వ అధికారిక వెబ్​సైట్​లో అప్​లోడ్ చేయడం లేదన్న అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవోలు, సర్క్యూలర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ.. భాజపా నాయకుడు పేరాల శేఖర్​రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష 7 వేల ఉత్తర్వులు జారీ చేయగా... అందులో 42 వేల 500 జీవోలు ప్రజలకు అందుబాటులో లేవని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజలకు సమాచారం లేకుండా చేయడం.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. వెబ్​సైట్​లో వెంటనే అప్​లోడ్ చేసే బాధ్యతను సీనియర్ అధికారికి అప్పగించాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంపై రెండు వారాల్లోగా స్పందించాలని ప్రభుత్వ సీఎస్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని కోర్టు ఆదేశించింది.

'జీవోలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు'

ఇవీ చూడండి: ట్రైలర్​: చింపేసిన సైరా.. చిరంజీవి ఔరా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.