ఒత్తిడి పెంచుతున్నారు..
చాలా కాలేజీల్లో అగ్నిమాపక చర్యలు, క్రీడా మైదానాలు, పార్కింగ్, గ్రంథాలయాలు, లెబొరేటరీ సదుపాయాలు లేవని వ్యాజ్యంలో ఆరోపించారు. అధిక సమయం తరగతులు నిర్వహిస్తున్నారని.. హాస్టళ్లలో ఒక్కో గదిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటున్నారని.. పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు. అనేక నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.
స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి ధర్మాసనం.. ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి: 'విద్యార్థులు క్రీడల్లో రాణించాలి'