ETV Bharat / state

'తెలంగాణ ట్రాన్స్‌కో ఉత్తర్వులు చెల్లవు' - highcourt latest updates

రాష్ట్ర విభజనకు ముందు సబ్‌ఇంజినీర్లు పోస్టుల నియామకాలకు ట్రాన్స్‌కో ఇచ్చిన నోటిఫికేషన్లు కాలం చెల్లినవంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియకు తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేయడం ఏకపక్షమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Highcourt on transco
'ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన నోటిఫికేషన్ చెల్లదు'
author img

By

Published : Mar 15, 2020, 6:13 AM IST

Updated : Mar 15, 2020, 6:50 AM IST

రాష్ట్ర విభజనకు ముందు సబ్‌ఇంజినీర్లు పోస్టుల నియామకాలకు ట్రాన్స్‌కో ఇచ్చిన నోటిఫికేషన్లు కాలం చెల్లినవంటూ, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియకు తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేయడం ఏకపక్షమని హైకోర్టు స్పష్టం చేసింది. సబ్‌ఇంజినీర్ల నియామకాలకు నిమిత్తం 2011, 2012ల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు కాలం చెల్లినవంటూ 2017 డిసెంబరులో జారీ చేసిన ట్రాన్స్‌కో ఆఫీస్‌ ఆర్డర్‌ (టూ), అదే ఏడాది డిసెంబరులో నియామకం కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్ట విరుద్ధమని, రాజ్యాంగంలోని అధికరణ 14కు అది విరుద్ధమని ప్రకటించింది.

వీటి జారీకి సరైన కారణాలు లేవని పేర్కొంటూ వాటిని రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2011, 2012లలో ఉమ్మడి రాష్ట్ర ట్రాన్స్‌కో జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారమే సబ్‌ ఇంజినీర్ల పోస్టులకు పిటిషనర్లతోపాటు అర్హులైనవారికి నియామక పత్రాలు జారీ చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కోను ఆదేశించింది. అయితే ఈ నియామకాలు కేవలం సబ్‌ఇంజినీర్లకు (ఎలక్ట్రికల్‌) మాత్రమే వర్తిస్తాయని, జూనియర్‌ ఇంజినీర్లు, జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు వర్తించవని స్పష్టం చేసింది.

ఈమేరకు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 2011లో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియను పూర్తి చేయకుండా 2017 డిసెంబరు 28న సబ్‌ఇంజినీర్ల నియామకం నిమిత్తం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ఈ నియామక ప్రక్రియ అభ్యర్థులకు నియామకం కోసం ఎలాంటి హక్కులు కల్పించదని, అయితే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందన్న సమాచారాన్ని కోర్టుకు చెప్పాల్సి ఉందని పేర్కొంది.

ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్​: కేసీఆర్‌

Last Updated : Mar 15, 2020, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.