ETV Bharat / state

'మతం మారితే మిలియనీర్ అయిపోరు' - పాఠశాల అడ్మిషన్లపై వ్యాఖ్యానించిన హైకోర్టు

ఒక మతం నుంచి మరొక మతానికి మారితే మిలియనీర్ అయిపోరని హైకోర్టు వ్యాఖ్యానించింది. గురుకుల పాఠశాల అడ్మిషన్​లలో దళిత క్రిస్టియన్​లకు 2 శాతం రిజర్వేషన్​లు కల్పించడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Highcourt on School admissions
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు
author img

By

Published : Mar 13, 2020, 6:12 AM IST

గురుకుల పాఠశాల అడ్మిషన్​లలో దళిత క్రిస్టియన్​లకు 2 శాతం రిజర్వేషన్​లు కల్పించడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5వ తరగతి అడ్మిషన్​లకు దరకాస్తులను ఆహ్వానిస్తూ.. సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్​లో దళిత క్రిష్ట్రియన్​లకు 2 శాతం సీట్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్​కు చెందిన పి. శ్రీనివాస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. క్రిస్టియన్​గా మారిన ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం చెల్లదని పిటిషనర్ తరఫు న్యాయవాది హరినాథ్ తెలిపారు.

మిలియనీర్ అయిపోరు..

ఒక ఎస్సీ వ్యక్తి హిందూ మతం నుంచి క్రిస్టియన్​గా మారితే బ్రాహ్మణ వ్యక్తిగానో, మిలియనీరో అయిపోయారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి వారికి రిజర్వేషన్ నిరాకరించడం సమంజసం కాదంది. ఒక మనిషి మతాన్ని మార్చుకున్నంత మాత్రాన అతని వెనుకబాటుతనం దూరం కాదని వివరించింది. వెనుకబడిన వారి అభివృద్ధికి కేంద్రం రిజర్వేషన్​లను అమలు చేస్తోందంది. గత 1000 ఏళ్లుగా దళిత క్రిస్టియన్లుగా మారిన వారికి న్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని వ్యాఖ్యానించింది.

4 వారాలకు వాయిదా..

ఈ రిజర్వేషన్ కేవలం గురుకుల పాఠశాలల అడ్మిషన్​లకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ. సంజీవ్ కుమార్ అన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీచేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి : అమెరికా వెళ్లొచ్చిన నిట్​ విద్యార్థి.. కరోనా అనుమానంతో ఆస్పత్రిలో చేరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.