ఏపీ విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకోవటంపై దాఖలైన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు విచారించింది. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఆర్‌పీసీ 151 కింద నోటీసెలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 151 కింద నోటీసులు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున చర్యలు తీసుకోలేదని డీజీపీ గౌతం సవాంగ్ బదులిచ్చారు.
సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ముందు సీఆర్‌పీసీ 151 సెక్షన్ ఆర్డర్ చదవాలని డీజీపీకి సూచించారు.
ఇదీ చూడండి: కిస్కా జాగీర్ నహీ.. కిస్ కా బాప్కా బీ నహీ: భట్టీ