ETV Bharat / state

'ఆన్​లైన్​ తరగతులపై స్పష్టమైన పాలసీ ఎందుకు రూపొందించలేదు?'

విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహించటం పట్ల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆన్​లైన్ తరగతులపై స్పష్టమైన, సమగ్రమైన పాలసీని ప్రభుత్వం ఎందుకు రూపొందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్​లైన్ తరగతుల కోసం అందరికీ లాప్​టాప్​లు, స్మార్ట్​ఫోన్​లు కొనే ఆర్థిక స్థోమత ఉంటుందా అని ధర్మాసనం నిలదీసింది. దీనిపై ఈ నెల 3 లోగా స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.

high court questioned telangana government on online classes for students
'ఆన్​లైన్​ తరగతులపై స్పష్టమైన పాలసీ ఎందుకు రూపొందించలేదు?'
author img

By

Published : Jul 1, 2020, 5:26 PM IST

ఆన్​లైన్ తరగతులపై ప్రభుత్వం స్పష్టమైన, సమగ్ర పాలసీ ఎందుకు రూపొందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్​లైన్ తరగతులపై ప్రభుత్వ విధానమేంటో ఎల్లుండి లోగా స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్​లైన్ తరగతులు నిషేధించాలని కోరుతూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

విద్యా సంవత్సరం ఖరారు చేయకముందే...

పిల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ప్రభుత్వం విద్యా సంవత్సరం ఖరారు చేయకముందే ప్రైవేట్ పాఠశాలలు ఆన్​లైన్ తరగతులు నిర్వహించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆన్​లైన్ తరగతులతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని.. ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

ఈ నెల 3 లోగా స్పష్టత ఇవ్వాలి...

జిల్లా విద్యా శాఖ అధికారులు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని.. చర్యలు తీసుకునే అధికారం డీఈఓలకే ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ నివేదించారు. ఆన్​లైన్ తరగతుల కోసం అందరికీ లాప్​టాప్​లు, స్మార్ట్​ఫోన్​లు కొనే ఆర్థిక స్థోమత ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. అలాంటప్పుడు ఆన్​లైన్ తరగతులపై ప్రభుత్వం స్పష్టమైన, సమగ్రమైన పాలసీని ఎందుకు రూపొందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్ర, పంజాబ్ ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయని ధర్మాసనం పేర్కొంది. దీనిపై ఈ నెల 3 లోగా స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.

ఇవీ చూడండి: బిరాబిరా గోదావరి: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.