ETV Bharat / state

High Court permits BJP dharna : రేపు ధర్నాచౌక్​లో బీజేపీ ధర్నా.. గ్రీన్​సిగ్నల్ ఇచ్చిన హైకోర్ట్ - BJP dharna on distribution of double bedroom

BJP dharna on double bedroom : డబుల్ బెడ్​రూం ఇళ్ల పంపిణీపై ఈ నెల 25న ధర్నచౌక్​ వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాకు.. హైకోర్టు అనుమతినిచ్చింది. ధర్నా శాంతియుతంగా నిర్వహించాలని, నిరసనలో 500 మందికి మించరాదని.. ఆ మేరకు పోలీసులకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని బీజేపీకి హైకోర్టు స్పష్టం చేసింది.

High Court
High Court
author img

By

Published : Jul 24, 2023, 4:58 PM IST

High Court permits BJP dharna : రాష్ట్రంలోని పేదలకు డబుల్ బెడ్​రూం ఇళ్లు పంపిణీ చేయాలంటూ ఈ నెల 25న బీజేపీ తలపెట్టిన ధర్నాకు.. షరతులు విధిస్తూ హైకోర్టు అనుమతినిచ్చింది. నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులను కేటాయించాలంటూ రేపు ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద బీజేపీ ధర్నా తలపెట్టింది. ఈనెల 14న, 20న దరఖాస్తు చేసినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని బీజేపీ లంచ్​మోషన్​ పిటిషన్ దాఖలు చేసింది.

ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ప్రదీప్ కుమార్ హైకోర్టులో వేసిన లంచ్‌మోషన్‌పై.. జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి అత్యవసర విచారణ జరిపారు. పోలీసులు ధర్నాచౌక్ వద్ద ధర్నాకు ఎందుకు అనుమతివ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయని.. వెయ్యి మంది ధర్నాలో పాల్గొంటే ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసుల తరఫు న్యాయవాది తెలిపారు.

అధికార పార్టీ కూడా ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయని.. అలాంటప్పుడు మాత్రం అభ్యంతరాలు రావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ధర్నాలో 500 మందికి మించరాదని.. ఆ మేరకు పోలీసులకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని బీజేపీకి హైకోర్టు స్పష్టం చేసింది. ర్యాలీలు నిర్వహించవద్దని.. ధర్నాకు హాజరయ్యే ముఖ్య నేతల వివరాలు పోలీసులకు సమర్పించాలని తెలిపింది. బీజేపీ ర్యాలీకి అనుమతివ్వాలని హైదరాబాద్ సీపీని హైకోర్టు ఆదేశించింది.

నిజామాబాద్​లో ధర్మపురి అర్వింద్ ధర్నా.. నిజామాబాద్‌ ధర్నాచౌక్‌లో బీజేపీ నేతలు ప్రభుత్వానికి వ్యతరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు పేదలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ సీఎంగా ఉంటే రెండు పడక గదుల ఇండ్లు రావని విమర్శించారు. పేదల కోసం కట్టిన ఇండ్లు.. పంపిణీ చేయకుండానే కూలిపోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇళ్లకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం బడ్జెట్‌లోని నిధుల్లో రూ.10,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే కవితకు నిధులు ఇస్తే లిక్కర్ స్కాంలో పెట్టుబడులు పెట్టారని మండిపడ్డారు. తన తల్లిదండ్రులను తిడితే.. తాను కవితను తిట్టకుండా ఊరుకోవాలా అని అర్వింద్ ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.