ETV Bharat / state

'ఆ రెండు స్థానాలకు 15 వరకు నోటిఫికేషన్​ వద్దు' - మాజీ ఎమ్మెల్సీలు

సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా శాసన మండలి తమ సభ్యత్వం రద్దు చేసిందన్న మాజీ ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవరెడ్డిల పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఆ స్థానాలకు ఈనెల 15 వరకు నోటిఫికేషన్​ జారీ చేయవద్దని హైకోర్టు ఈసీని ఆదేశించింది.

ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : May 9, 2019, 6:05 PM IST

Updated : May 9, 2019, 6:43 PM IST

నిజామాబాద్​లో మాజీ ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవరెడ్డిల అనర్హతతో ఖాళీ అయిన స్థానాలకు ఈనెల 15 వరకు నోటిఫికేషన్​ జారీ చేయవద్దని హైకోర్టు ఈసీని ఆదేశించింది. సభ్యత్వం రద్దుకు సంబంధించి రికార్డులను తమకు సమర్పించాలని శాసన మండలికి హుకుం జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ ఎస్​ చౌహాన్​ నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఆ స్థానాలకు నోటిఫికేషన్​ ఇవ్వద్దని ఈసీని ఆదేశించిన హైకోర్టు

ఫిరాయింపుల ఆరోపణలతో...

నిజామాబాద్​లో స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి, శాసన సభ్యుల కోటా నుంచి యాదవరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న తెరాస ఫిర్యాదుతో మండలి ఛైర్మన్​ స్వామిగౌడ్​ వీరిపై అనర్హత వేటు వేశారు. దీనిని సవాల్​ చేస్తూ భూపతిరెడ్డి, యాదవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తమ సభ్యత్వం రద్దు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. విచారణ జరిపిన ధర్మాసనం ఈసీకి ఆదేశాలిస్తూ ఈనెల 15కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి : వనస్థలిపురం చోరీ: సులభ్​కాంప్లెక్స్​లో మతలబు!

Last Updated : May 9, 2019, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.