ETV Bharat / state

వరదసాయం నిలిపివేతపై ప్రభుత్వానికి, ఎస్​ఈసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్​లో వరద సాయం పంపిణీ నిలిపివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

High Court orders Govt, S.E.C. on suspension of flood relief
వరదసాయం నిలిపివేతపై ప్రభుత్వానికి, ఎస్​ఈసీకి హైకోర్టు ఆదేశం
author img

By

Published : Nov 23, 2020, 6:58 PM IST

పది వేల రూపాయల వరద సాయం పంపిణీ నిలిపివేతపై రేపు పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వరద సాయం నిలిపివేయాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది శరత్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

విపత్తుల సమయంలో సహాయానికి ఎన్నికల కోడ్ వర్తించదని పిటిషనర్ శరత్ వాదించారు. ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చి సాయం కొనసాగించవచ్చునన్న నిబంధనలు చెబుతున్నాయని వాదించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నియామళి అమల్లోకి వచ్చినందున... ప్రభుత్వ నిధులను ప్రజలకు పంపిణీ చేయరాదని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది విద్యాసాగర్ వాదించారు. తదుపరి వాదనల కోసం విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.