హైదరాబాద్ పాతబస్తీలోని జగన్నాథ స్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్, బహదూర్ పురా తహసీల్దార్‌ను హైకోర్టు ఆదేశించింది. శాలిబండ హరిబౌలిలోని జగన్నాథ స్వామి ఆలయాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని పేర్కొంటూ తెలంగాణ వానర సేన సొసైటీ అధ్యక్షుడు రామిరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఆలయానికి చెందిన భూమిలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలతో రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, బహదూర్ పుర తహసీల్దార్‌ను ధర్మాసనం ఆదేశించింది.
ఇదీ చదవండి : కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్