ETV Bharat / state

ప్రజా ప్రతినిధుల కేసులపై హైకోర్టు కీలక ఉత్తర్వులు - హైకోర్టు తాజా వార్తలు

High Court on Public Representatives Cases : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను త్వరతగతిన విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులకు సంబంధించిన విచారణ పురోగతిని రెండు నెలల్లోపు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.

Telangana High Court Latest Orders
High Court on Public Representatives Cases
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 7:52 PM IST

High Court on Public Representatives Cases : రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారించడానికి హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. చీఫ్ జస్టిస్‌ ఆలోక్ అరాధే, జిస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులను విచారించింది.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టులలో ప్రస్తుత, మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను రిజిస్ట్రార్‌ జనరల్‌, ధర్మాసనానికి నివేదించారు. 115 కేసులు పెండింగులో ఉన్నాయని పేర్కొనడంతో 46 కేసుల్లో నిందితులకు 2 వారాల్లో సమన్లు జారీ చేయాలని కోర్టులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 కేసుల్లో ఉన్న స్టేలపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Telangana High Court Latest Orders : 11 కేసుల్లో నిందితులు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వివిధ దశల్లో ఉన్న 15 కేసుల విచారణను వేగవంతం చేయాలని సదరు కోర్టులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించిన విచారణ పురోగతిని రెండు నెలల్లోపు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.

రాజేంద్రనగర్​లో 100 ఎకరాల్లో నూతన హైకోర్టు - జనవరిలో శంకుస్థాపన ఏర్పాట్లకు సీఎం ఆదేశాలు

మార్గదర్శిపై కేసుల విచారణ నిలిపివేయాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.