ETV Bharat / state

పార్థసారథి చట్టబద్ధమైన బెయిల్​కు అర్హుడే: హైకోర్టు

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సీఎండీ పార్థసారథిపై ఈడీ కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్​ను పొడిగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కేసు నమోదు చేసి 60 రోజులైనప్పటికీ దర్యాప్తు పూర్తి చేయనందున రిమాండ్ పొడిగించడం తగదని.. చట్టబద్ధమైన బెయిల్​కు అర్హుడని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

పార్థసారథి చట్టబద్ధమైన బెయిల్​కు అర్హుడే: హైకోర్టు
పార్థసారథి చట్టబద్ధమైన బెయిల్​కు అర్హుడే: హైకోర్టు
author img

By

Published : May 18, 2022, 5:40 AM IST

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సీఎండీ పార్థసారథిపై ఈడీ కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్​ను పొడిగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కేసు నమోదు చేసి 60 రోజులైనప్పటికీ దర్యాప్తు పూర్తి చేయనందున రిమాండ్ పొడిగించడం తగదని.. చట్టబద్ధమైన బెయిల్​కు అర్హుడని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈడీ కేసులో రిమాండ్ పొడిగించడంపై పార్థసారథి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పార్థసారథి జనవరి 20 నుంచి జైలులో ఉన్నారని.. మార్చి 21 నాటికి 60 రోజులు పూర్తయిందని.. కాబట్టి రిమాండ్ పొడిగించడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.

పార్థసారథి వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయనందున సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పార్థసారథి చట్టబద్ధమైన బెయిల్​కు అర్హుడేనని హైకోర్టు పేర్కొంది. తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని పార్థసారథికి హైకోర్టు సూచించింది. తాజాగా పిటిషన్ దాఖలు చేస్తే వారంలోగా చట్టప్రకారం తగిన నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టుకు ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.