కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలి: ఏపీ హైకోర్టు - అమరావతిపై హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్తీకరణ చట్టం అనుసరించి అమలు చేయటం లేదని వేసిన పిటిషన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు, రాజధాని సంబంధిత బిల్లులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఆగస్టు 6వ తేదికి వాయిదా పడింది.
అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు, రాజధాని సంబంధిత బిల్లులపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగిందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 6వ తేదికి వాయిదా వేశారని వెల్లడించారు. మొత్తం 32 కేసులను హైకోర్టు ధర్మాసనం విచారించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్తీకరణ చట్టం అనుసరించి అమలు చేయటం లేదని వేసిన పిటిషన్ పై రెండేళ్లుగా ఎందుకు కౌంటర్ వేయటం లేదని కోర్టు ప్రశ్నించినట్లు చెప్పారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు లక్ష్మీనారాయణ వివరించారు. రాజధాని సంబంధిత బిల్లులు మరోసారి అసెంబ్లీలో పెట్టారు కాబట్టి విచారణ త్వరగా ముగించాలని తాము కోరగా... ధర్మాసనం ఆగస్టు 6వ తేదికి విచారణ వాయిదా వేసినట్లు తెలిపారు.