ETV Bharat / state

High Court notices to Madhusudanachari : మాజీ స్పీకర్​ మధుసూదనచారికి హైకోర్టు నోటీసులు

High Court notices to Madhusudanachari: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన మాజీ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనచారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీ పదవీ పొందారంటూ ధనగోపాల్ అనే వ్యక్తి అతనిపై పిటిషన్​ వేయగా.. వాదనలు విన్న ధర్మాసనం.. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ మధుసూదనచారికి గవర్నర్‌ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

High Court
High Court
author img

By

Published : Nov 4, 2022, 8:37 AM IST

High Court notices to Madhusudanachari: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూదనచారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా గవర్నర్‌ కోటా కింద గోరేటి వెంకన్న, బస్వరాజ్‌ సారయ్య, దయానంద్‌ను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాలు చేస్తూ ధనగోపాల్‌ అనే వ్యక్తి 2020లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగా.. 2021 నవంబరులో మధుసూదనచారిని ప్రతివాదిగా చేర్చాలంటూ.. ధనగోపాల్‌ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని తప్పుబట్టారు. ఇది అలహాబాద్‌ హైకోర్టు తీర్పుకు విరుద్దంగా ఉందని న్యాయవాది పేర్కొన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్సీల నియామక వ్యవహారం గవర్నర్‌ విచక్షణాధికారంపై ఉంటుందని.. దీనికి రాజ్యాంగం అధికారం కల్పించిందన్నారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మంత్రి మండలి సిఫార్సుతోనే నియామకం జరుగుతుందని.... కౌంటర్‌ దాఖలు చేశాక పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ మధుసూదనచారికి. గవర్నర్‌ కార్యదర్శికి నోటీసులు జారీ చేసినా హైకోర్టు.. విచారణను డిసెంబరు 7వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.