Maoist Leader RK Life Story: మావోయిస్టు నేత ఆర్కే జీవిత చరిత్ర ఆధారంగా ఆయన భార్య శిరీష ప్రచురిస్తున్న 'సాయుధ శాంతి స్వప్నం' పుస్తకంపై నిషేధాన్ని హైకోర్టు ఎత్తివేసింది. గతేడాది నవంబరులో విద్యానగర్లో ప్రింటింగ్ ప్రెస్పై పోలీసులు సోదాలు నిర్వహించి పుస్తకాలను సీజ్ చేయడంతో పాటు ప్రెస్ నిర్వాహకులు రామకృష్ణారెడ్డి, సంధ్యపై కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరును సవాల్ చేస్తూ శిరీష, రామకృష్ణారెడ్డి, సంధ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రింటింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని మావోయిస్టు నిషేధిత ప్రాంతంగా నోటిఫై చేయలేదు కాబట్టి.. ప్రచురణలపై నిషేధం విధించి స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. స్వాధీనం చేసుకున్న పుస్తకాలను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు రామకృష్ణారెడ్డి, సంధ్యలపై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఇదీ చదవండి: