ETV Bharat / state

కింగ్​ కోఠి ప్యాలెస్​ వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు - King Kothi Palace dispute

కింగ్‌ కోఠి ప్యాలెస్​కు సంబంధించిన వివాదంలో పరస్పరం నమోదు చేసుకున్న కేసులపై దర్యాప్తు నిర్వహించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యాజమాన్య హక్కుల జోలికి వెళ్లొద్దని సూచించింది. వివాదంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

కింగ్​ కోఠి ప్యాలెస్​ వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు

author img

By

Published : Apr 13, 2022, 5:38 AM IST

హైదరాబాద్​లోని కింగ్‌ కోఠి ప్యాలెస్​కు సంబంధించిన వివాదంలో పరస్పరం నమోదు చేసుకున్న కేసులపై దర్యాప్తు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యాజమాన్య హక్కులు కోర్టులు నిర్ణయిస్తాయని.. వాటి జోలికి వెళ్లొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ ప్రాంగణంలో భవనంపై ప్రైవేటు వ్యక్తుల ఒత్తిడితో పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్​ చేస్తూ నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నగల వ్యాపారి ఆశి, రియల్టర్స్‌ భాగస్వామి సుఖేష్‌గుప్తా, ఐరీస్‌ హాస్పిటాలిటీ డైరెక్టర్‌ అమిత్‌ ఆమ్లా ఒత్తిడితో పోలీసులు దురుసుగా వ్యవహరించారన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఇరుపక్షాలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. నమోదు చేసిన రెండు కేసులపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. వివాదంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేత

భారీగా పెరిగిన బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధర ఇలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.