ETV Bharat / state

'ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రైవేటు బస్సులు'

ఆర్టీసీలో ప్రైవేట్ బస్సుల అద్దె అంశం కూడా హైకోర్టుకు చేరింది. సంస్థ యాజమాన్యం నిర్ణయం సరికాదంటూ.. కార్మిక సంఘాలు వేసిన పిటిషన్​పై విచారణ జరిగింది.

ప్రైవేటు బస్సులపై హైకోర్టులో విచారణ
author img

By

Published : Oct 22, 2019, 6:35 PM IST

ప్రైవేటు బస్సులపై హైకోర్టులో విచారణ

ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నామని హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం నివేదించింది. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఆదేశించిందని పేర్కొంది.

ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకునేందుకు టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు. ఏడాది పాటు నడిపేందుకు 1,035 ప్రైవేట్ బస్సులను చట్ట విరుద్ధంగా అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సూర్యకిరణ్ రెడ్డి వాదించారు. నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీకి.. బోర్డు లేదని... అలాంటప్పుడు ఇంఛార్జి ఎండీ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. శాశ్వత ప్రాతిపదికన ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకోవడం వల్ల.. కార్మికుల ఉద్యోగాలు పోతాయని వాదించారు.

ఆర్టీసీ ఎండీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నోటిఫికేషన్ ఇచ్చామని.. ప్రజల అవసరాల కోసం ఆర్టీసీని ఆదేశించే అధికారం సర్కారుకు ఉందని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... ఈనెల 28న ప్రధాన న్యాయమూర్తి వద్ద విచారణ జరగనున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ఇవీ చూడండి: గిరిజనులతో కలిసి నృత్యం చేసిన గవర్నర్ తమిళిసై

TG_HYD_40_22_HC_ON_PRIVATE_HIRE_BUSES_AV_3064645 REPORTER: NAGESHWARA CHARY ( ) ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నామని హైకోర్టుకు ఆర్టీసీ నివేదించింది. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఆదేశించిందని పేర్కొంది. ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకునేందుకు టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు. ఏడాది పాటు నడిపేందుకు 1035 ప్రైవేట్ బస్సులను చట్ట విరుద్ధంగా అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సూర్యకరణ్ రెడ్డి వాదించారు. నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీకి బోర్డు లేదని... అలాంటప్పుడు ఇంచార్జి ఎండీ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. శాశ్వతప్రాతిపదికన ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకోవడం వల్ల.. కార్మికుల ఉద్యోగాలు పోతాయని వాదించారు. ఆర్టీసీ ఎండీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వాల ఆదేశాల మేరకు నోటిఫికేషన్ ఇచ్చామని.. ప్రజల అవసరాల కోసం ఆర్టీసీని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... ఈనెల 28న ప్రధాన న్యాయమూర్తి వద్ద విచారణ జరగనున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. END
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.